బాలికల మరణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి

# బాలికల ఒక్కో కుటుంబానికి 10 లక్షల ఎక్స్గ్రేషియా, ఇంట్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి

# భువనగిరి ప్రభుత్వ హాస్టల్లో మరణించిన బుధరావుపేట బాలిక మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం.

# కుటుంబ సభ్యులను పరామర్శ

 

# నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి

నర్సంపేట,నేటిధాత్రి :

భువనగిరిలోని ప్రభుత్వ బాలికల హాస్టల్ నందు 10వ తరగతి చదువుతున్న ఇద్దరు బాలికలు హాస్టల్ గదిలో ఆదివారం ఉరి వేసుకొని మరణించారని అందుకు కాంగ్రెస్ ప్రభుత్వమే పూర్తి బాధ్యత
వహించాలని మాజీ ఎమ్మెల్యే,తెలంగాణ ఉద్యమ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోపించారు.ఈ సందర్భంగా వారి మృతి పట్ల పెద్ది సంతాపాన్ని వ్యక్తం చేశారు.మరణించిన ఈ ఇద్దరు బాలికలు పూర్వపు వరంగల్ జిల్లాలోని బలహీన వర్గాలకు చెందిన నిరుపేద వారు కాగా అందులో ఒకరు నర్సంపేట నియోజకవర్గం, ఖానాపూర్ మండలం బుధరావుపేట గ్రామానికి చెందిన కోడి భవ్య అదేవిధంగా స్టేషన్ ఘన్ పూర్ నియోజవర్గానికి చెందిన మరొక బాలిక ఆత్మహత్యలకు పాల్పడ్డారు.కాగా మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి బిఅర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి ఖానాపూర్ మండలం బుధరావుపేట గ్రామానికి చెందిన కోడి భవ్య మృతదేహాన్ని సందర్శించారు.బాలిక మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చి సానుభూతి తెలిపారు.ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ
ప్రభుత్వ నిర్లక్ష్యం వలన, హాస్టల్ అధికారుల పర్యవేక్షణ లోపం వల్లే తమ పిల్లలు మరణించారని బాధిత తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారన్నారు.బంధువుల అభిప్రాయం మేరకు ఈ రెండు ఆత్మహత్యలు ప్రభుత్వ హత్యలే అని ఈ మరణాలకు ప్రభుత్వమే పూర్తి భాద్యత వహించాలని డిమాండ్ చేశారు.ఒకే హాస్టల్ గదిలో ఇద్దరు బాలికలు ఉరి వేసుకొని మరణించడం, తల్లిదండ్రులు అనుమతి లేకుండా శవాలను మార్చురీకి తరలించడం, సంఘటనా స్థలాన్ని పూర్తిగా పోలీసుల ఆధీనంలోకి తీసుకోవడం, ఆందోళన చేసినవారిపై దురుసుగా ప్రవర్తించి లాఠీఛార్జ్ చేయడం అలాగే ఇప్పటివరకు స్పష్టమైన కేసు నమోదు చేయకపోవడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఆరోపించారు.చనిపోయిన బాధితుల కుటుంబాలను ప్రభుత్వం తక్షణమే ఆదుకోని, వారి కుటుంబ సభ్యుల్లో ఒకరి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని వీటితో పాటు ఒక్కో కుటుంబానికి 10 లక్షల ఎక్స్గ్రేషియాను అధికారికంగా ప్రకటించాలని మేము మాజీ ఎమ్మెల్యే పెద్ది డిమాండ్ చేశారు.పూర్వ వరంగల్ జిల్లాకు చెందిన మంత్రులు ఈ ఘటనపై స్పందించి ప్రత్యేక చొరవ తీసుకొని ప్రభుత్వాన్ని ఒప్పించి, నిరుపేదలైన ఈ రెండు కుటుంబాలకు తగు న్యాయం చేయాలని ఈ సందర్భంగా పెద్ది కోరారు.ఈ పరమర్శలో ఎంపిపి వేములపెల్లి ప్రకాష్ రావు,మండల పార్టీ అధ్యక్షులు, మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్ గౌడ్ ,సర్పంచ్, ఎంపిటిసి, ఇతర ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులు, తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *