
Red Flag Party.
ప్రభుత్వం భూములను గుర్తించేది ఎర్రజెండా పార్టీ
#నెక్కొండ, నేటి ధాత్రి:
ఉమ్మడి రాష్ట్రంలోనూ ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలోనూ ప్రభుత్వ భూములను కబ్జా చేసిన కబ్జాదారుల నుండి వెలికి తీసే చూపెట్టిన పార్టీ సిపిఐ ఎర్ర జెండా పార్టీ అని వరంగల్ జిల్లా సిపిఐ కార్యదర్శి మేకల రవి అన్నారు. వరంగల్ జిల్లా నెక్కొండ మండల కేంద్రంలో మండల కార్యదర్శి కందిక చెన్నకేశవులు అధ్యక్షతన జరిగిన 72వ సిపిఐ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ కొందరు అధికారుల అండదండలతో ప్రభుత్వ భూములను, దేవాలయ భూములను, కబ్జా చేసినా కబ్జా కోర్ల నుండి బయటకు తీసి గుడిసెలు వేసి దెబ్బలు పడి, కేసులపాలై, ప్రభుత్వానికి అప్పజెప్పిన ఘనత సిపిఐ పార్టీ , ఎర్రజెండాదని ఇది ఉమ్మడి జిల్లాలో, జిల్లా కేంద్రంలోనే జరిగిందని కాళిదాసు ప్రభుత్వ భూమిని కొందరు భూకబ్జా కోర్ల నుండి బయట తీసి ప్రభుత్వానికి, న్యాయస్థానం ద్వారా ప్రభుత్వానికి అప్పజెప్పారని, ఆ స్థలం లోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఆడిటోరియంలు నెలకొల్పిందని ఆయన గుర్తు చేశారు. ప్రజా సేవకు ఏ పదవులు అధికారం లేకున్నా ప్రజల అండదండలతో ఎన్నో ఉద్యమాలు చేస్తూ 100 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ సిపిఐ అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు పంజాల రమేష్, జిల్లా సహాయ కార్యదర్శిలు ఎస్కే భాష్మియా, పనస ప్రసాద్, అక్క పెళ్లి రమేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు గుండె బద్రి ,దండు లక్ష్మణ్, సంఘి ఎలేందర్, ముని,జిల్లా సమితి సభ్యులు మహమ్మద్ అక్బర్ ,అయిత యాకయ్య, మియాపురం గోవర్ధన్, మండల నాయకులు మెరుగు మల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.