
CPI city secretary Kasireddy Surender Reddy.
సర్వే నెంబర్ 574 ప్రభుత్వ భూమికి హద్దులు నిర్ణయించి స్వాధీనం చేసుకోవాలి.
సిపిఐ
కరీంనగర్, నేటిధాత్రి:

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ రెవెన్యూ పరిధిలోని 574 సర్వే నెంబర్లో గల పదమూడు ఎకరాల పద్దెనిమిది గుంటల ప్రభుత్వ భూమిని భూభారతి పోర్టల్లో ప్రొహిబిటెడ్ లిస్టులో చేర్చడంతో పాటు సర్వే నెంబర్ కు హద్దులు నిర్ణయించి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని సిపిఐ ఆధ్వర్యంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్ కి ప్రజావాణిలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి మాట్లాడుతూ తిమ్మాపూర్ మండలంలోని నుస్తులాపూర్ రెవెన్యూ పరిధిలో 574 సర్వే నెంబర్ లోని పదమూడు ఎకరాల పద్దెనిమిది గుంటల ప్రభుత్వ భూమి ఉందని ఇది కొన్ని సంవత్సరాలుగా జ్యోతిష్మతి కళాశాల యజమాన్యం ఆక్రమించి భవనాలు నిర్మించిందని దీనిపై ఇప్పటికి ఎవరు చర్యలు తీసుకోక పో వడంతో కళాశాల యజమాన్యం ప్రభుత్వ భూమిలో ఏదేచ్ఛగా భవనాలు నిర్మించి తరగతులు నిర్వహిస్తుందన్నారు. కరీంనగర్ హైదరాబాద్ నేషనల్ హైవే కు సమీపంలో ఉన్న సుమారు నూటయాభై కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన అధికారులు ఏమాత్రం పట్టించుకోకపోవడం దారుణం అన్నారు. జిల్లా అధికారులు వెంటనే స్పందించి ఈయొక్క సర్వే నంబర్లు కొలతలు వేసి స్వాధీన పరుచుకోవాలని లేకుంటే సిపిఐ ఆధ్వర్యంలో నిరుపేదలతో ఆక్రమిస్తామని ఆయన హెచ్చరించారు. ఈవినతి పత్రం సమర్పించిన వారిలో సిపిఐ నగర సహాయ కార్యదర్శిలు పైడిపల్లి రాజు, న్యాలపట్ల రాజు, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మచ్చ రమేష్, ఉపాధ్యక్షులు కలుకం సాగర్, తదితరులు అందజేశారు.