ఎమ్మెల్యే గండ్ర
చిట్యాల,నేటిధాత్రి :
సహకార సంఘాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేసిందని ఎమ్మెల్యే ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి అన్నారు. బుధవారం రోజు చిట్యాల మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన సహకార సంఘ బ్యాంక్, గోదాము,షాపింగ్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి డీసీసీబీ చైర్మన్ శ్రీ మార్నేని రవీందర్ రావు,జయశంకర్ భూపాలపల్లి జిల్లా బి ఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి గండ్ర జ్యోతి గార్లతో కలిసి ముఖ్యఅతిథిగా విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన భూపాలపల్లి శాసన సభ్యులు గండ్ర వెంకట రమణా రెడ్డి ,
రూ.106లక్షలతో నిర్మించిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం బ్యాంకు మరియు గోదాము మరియు షాపింగ్ కాంప్లెక్స్ లను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులకు వ్యవసాయమే ప్రధాన జీవనాధారమని, ఇలాంటి కీలకమైన రంగానికి సేవలందించడంలో పీఏసీఎస్లదే ముఖ్య పాత్ర అని అన్నారు. రైతులు ఆర్థికంగా చితికిపోకుండా సహకార సంఘాలు ఎంతో తోడ్పాటును అందిస్తున్నాయని చెప్పారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు రైతులకు రుణాలను ఇవ్వడమే కాకుండా వారిని ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నాయని పేర్కొన్నారు. సహకార సంఘాలను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం అవసరమైన నిధులు మంజూరు చేస్తూ అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు.
గత ప్రభుత్వాల హయాంలో సహకార సంఘాలు నిర్వీర్యమై ఉన్నాయన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సహకార సంఘాలను చైతన్యపరిచి అనేక రకాలుగా అభివృద్ధి చేశామన్నారు. సహకార సంఘాల ద్వారా రైతులకు స్వల్పకాలిక, దీర్ఘకాలిక రుణాలతో పాటు ఎరువులు పురుగుమందులు అందజేచేయడమే కాక రైతులు తమ పంటను నిల్వ చేసుకునేందుకు సహకార సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున లక్షల రూ.లు బడెజ్ట్ తో గోదాములు నిర్వహించామన్నారు.ముఖ్య మంత్రి కేసీఆర్ కృషితో నేడు సహకార సంఘాలు రైతులకు అండగా నిలుస్తున్నా యన్నారు. సహకార సంఘాలను వాణిజ్యపరంగా కూడా అభివృద్ధి చేస్తూ తెలంగాణ రాష్ట్రం దేశంలో ఆదర్శంగా నిలుస్తుందన్నారు. రైతులు సహకార సంఘం సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు…
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు