పర్యావరణ శాస్త్రవేత్త ఉమామహేశ్వర్ రెడ్డి.
మహబూబాబాద్,నేటిధాత్రి:
డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ తెలంగాణ మరియు కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ పర్యావరణ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో చేపడుతున్న స్కూల్ హెల్త్ క్లబ్ మరియు యంగ్ ఎర్త్ లీడర్షిప్ కార్యక్రమము జెడ్పిహెచ్ఎస్ అమనగల్ పాఠశాలలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కళ్లెం వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన పర్యావరణ శాస్త్రవేత్త సి.ఉమామహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ పర్యావరణ,నీటి సంరక్షణ ప్లాస్టిక్,రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి భూమాతను పరిరక్షించడమే ఈ సంస్థ ఉద్దేశం అన్నారు.భూమి మీద అనేక రకాల మొక్కలు,జంతువులు నివసిస్తున్నాయని వాటికి కావలసిన ఆహారం కూడా ఈ భూమి మీదనే లభ్యమవుతుందని అందుకొరకే ఈ మట్టి మేలు మరవరాదని దీనిని కాపాడవలసిన బాధ్యత విద్యార్థులుగా మీపై ఉందని కోరారు.అందుకొరకే ప్రతి పాఠశాలలో స్కూల్ ఎర్త్ క్లబ్స్ ఏర్పాటు చేస్తున్నామని ఈ సంస్థ ద్వారా మీరు తెలుసుకున్న విషయాలను ప్రజలకు తెలియపరచి ప్రజలను చైతన్యవంతం చేసి ప్రకృతిని పరిరక్షించాలన్నారు.సంస్థ స్టేట్ కన్వీనర్ రత్తం వెంకటేష్ మాట్లాడుతూ ప్రకృతి ఒక గొప్ప ఇంజనీర్ అని దానిని అదే సంరక్షించుకోవడానికి అనేక అరమరికలు చేసుకుంటుందని ఉదాహరణకు పగలు భూమి గ్రహించిన ఉష్ణాన్ని రాత్రిపూట భూమికరణ ప్రక్రియ ద్వారా వదులుతుందని,సూర్యుని నుండి విడుదలయ్యే అతినీలలోహిత కిరణాలు భూమి మీద పడకుండా ఓజోన్ పొర కాపాడుతుందని,దానిని పరిరక్షించే బాధ్యత మనపై ఉందన్నారు.అందుకే పౌరులుగా మనం మొక్కలు నాటడం,కంపోస్ట్ ఎరువుల వాడకం,ప్లాస్టిక్ వాడకం తగ్గించడం,భూగర్భ జలాలను కాపాడడం,వ్యాయామానికి సైకిల్ తొక్కడం ద్వారా ప్రకృతిని పరిరక్షించాలని,మనం తినే ఆహారాన్ని వృధా చేయరాదని పై కార్యక్రమాల నిర్వహణ ద్వారా పర్యావరణ సమ్మతుల్యత కాపాడబడి సమస్త జీవకోటి ఆయు: ప్రమాణం పెరుగుతుందన్నారు.అనంతరం ప్రోగ్రాం హ్యాండ్ బుక్,పోస్టర్లను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయిని సిద్ధోజు కవిత,ప్రోగ్రాం గైడ్ టీచర్ బలాస్టి రమేష్ మరియు విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.