
State-Level Volleyball Student Felicitated by Goldsmiths
రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు ఎన్నికైన విద్యార్థికి స్వర్ణకార చేతివృత్తుల సంఘం ఘనసన్మానం.
మల్లాపూర్ అక్టోబర్ 14 నేటి ధాత్రి
మల్లాపూర్ మండల కేంద్రానికి చెందిన సార రుత్విక్ జిల్లాస్థాయి వాలీబాల్ పోటీలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయికి ఎంపికైనందున మల్లాపూర్ స్వర్ణకార చేతివృత్తుల సంఘం ఆధ్వర్యంలో ఘన సన్మానం చేయడం జరిగినది. ఇట్టి కార్యక్రమంలో స్వర్ణకార సంఘం అధ్యక్షుడు బెజ్జారపు గంగాధర్ మాట్లాడుతూ భవిష్యత్తులో రిత్విక్ అనేక విజయాలు సాధించాలని, అలాగే ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, అలాగే నేటి విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో కూడా రాణించాలని సూచిస్తూ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపినారు. ఇట్టి కార్యక్రమంలో జగిత్యాల జిల్లా స్వర్ణకార సంఘం ఉపాధ్యక్షులు ఎగ్యారపు శ్రీనివాస్, జిల్లా సంయుక్త కార్యదర్శులు తిప్పర్తి కిషన్, సింహరాజు నరేష్, అలాగే సంఘ సభ్యులు తుమ్మనపల్లి శ్రీనివాస్, బెజ్జారపు తిరుపతి, బెజ్జారపు శ్రీనివాస్, కట్ట వీరేంద్ర చారి, గన్నరపు రమేష్, ఎగ్యారపు వెంకటరమణ, ద్రుశెట్టి రాజేష్, దురిశెట్టి శ్రీనివాస్, ఆకోజి వెంకటరమణ అలాగే విద్యార్థి తల్లిదండ్రులు పాల్గొన్నారు.