దొంగలు ఎత్తుకెళ్లినారని అనుకున్న బంగారం ఇంటిలోనే దొరికింది

-హుటా హుటిన ఘటన స్థలానికి చేరుకున్న ఎస్ఐ

-ఎస్సై శ్రీకాంత్ ను అభినందించిన నీలోజిపల్లి గ్రామస్తులు

బోయినిపల్లి, నేటిధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం నీలోజిపల్లి గ్రామానికి చెందిన అనుముల ఎల్లవ్వ భర్త నారాయణ బుధవారం రోజున కోనరావుపేట మండలం నిమ్మ పెళ్లి వివాహ కార్యక్రమానికి హాజరైన తర్వాత తిరిగి ఇంటికి వచ్చి తను వేసుకున్న నెక్లెస్ ను ఇంట్లో సెల్పులు బట్టల కింద దాచినారు.ఇంట్లో అందాద ఉదయం తొమ్మిదిన్నర గంటల సమయంలో ఆమె తలుపులకు గడియ పెట్టి,పక్కింటి వారితో మాట్లాడడానికి ఇంట్లోకి వెళ్లి,అందాద 12 గంటల సమయంలో తిరిగి ఇంట్లోకి వెళ్ళింది.ఆమెకు అనుమానం వచ్చి వెతికి చూడగా సెల్పులో బట్టల కింద రెండు తూలాల నెక్లెస్ చూసేసరికి కనిపించలేదు.ఆమె భర్త నారాయణ తీసి మరో చోట దాచాడు అని, అనుకుంది. సాయంత్రం ఐదున్నరకు తన భర్త నారాయణ కరీంనగర్ లో డ్యూటీ ముగించుకొని తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత భర్తను నెక్లెస్ గురించి అడగగా,నేను తీయలేదు అని సమాధానం చెప్పడంతో, కనబడుటలేదని,దొంగలు ఎత్తుకెళ్లారేమోని మండల ఎస్సై శ్రీకాంత్ కు కుటుంబ సభ్యులు సమాచారం అందించారు.మండల ఎస్సై తన సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకొని,డాగ్ స్క్వాడ్ మరియు ఫింగర్ ప్రింట్స్ అధికారులను పిలిపించగా,డాగ్ స్క్వాడ్ తో సహాయంతో అట్టి బంగారాన్ని వెతికించి పరిశీలించగా ఇంటిలోనే ఉందని ఆ బంగారాన్ని కుటుంబ సభ్యులకు మండల ఎస్సై శ్రీకాంత్ అప్పగించడం జరిగింది.
ఎస్సై శ్రీకాంత్ మాట్లాడుతూ:ఎల్లవ్వ అనే ఆమె వివాహానికి వెళ్లొచ్చిన తర్వాత ఒకచోట పెట్టి,మర్చిపోయి మరో చోట వెతికితే కనిపియ్యలేదని అని అన్నారు.నీలోజిపల్లి గ్రామస్తులు మండల ఎస్సై శ్రీకాంత్ తో పాటు సిబ్బందిని మరియు డాగ్ స్క్వాడ్, ఫింగర్ ప్రింట్స్ టీమ్ ను అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!