Congress Leaders Launch Procurement Centers & Distribute Sarees
మహిళలు అభివృద్ధి చెందాలన్నదే ప్రజా ప్రభుత్వ లక్ష్యం.
మండల పార్టీ అధ్యక్షులు గూట్ల తిరుపతి.
చిట్యాల, నేటిదాత్రి :
భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలో ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా నవాబ్ పేట, గోపాలపురం గ్రామాల్లో ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ చిట్యాల మండల అధ్యక్షులు గూట్ల తిరుపతి* హాజరై మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది .
భూపాలపల్లి శాసన సభ్యులు గండ్ర సత్యనారాయణ రావు* ఆదేశానుసారం మండలంలోని నవాబ్ పేట, నైన్ పాక, గోపాలపురం గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను చిట్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మడి శ్రీదేవి తో కలిసి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గూట్ల తిరుపతి పాల్గొని ధాన్యం కొనుగోలు కేంద్రాలను సోమవారం రోజున ఉదయం ప్రారంభించడం జరిగింది, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. మహిళలు అభివృద్ధి చెందాలనేదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని రైతుల సంక్షేమం కోసం పాటుపడే ప్రభుత్వమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు ఈ కార్యక్రమం లొ ఐకెపిసిసి రమణ దేవి సిసి సాంబశివుడు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి దొడ్డికిష్టయ్య, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా కార్యదర్శి పింగిలి జ్యోతి రెడ్డి ఆయా గ్రామాల మహిళలు రైతులు గ్రామా శాఖ అధ్యక్షులు,మండల సీనియర్ నాయకులు, మహిళలు,యూత్ కాంగ్రెస్ నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
