ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం….
జహీరాబాద్. నేటి ధాత్రి:
న్యాల్కల్ మండల్ అత్నూర్ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ష్టాత్మకంగా చేపడుతున్న సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం గురువారము మండల పరిధిలోని అత్నూర్ గ్రామంలో డీలర్ అబ్దుల్ రెహమాన్ రేషన్ షాపులో మండల కాంగ్రెస్ సీనియర్ యువ నాయకులు మొహమ్మద్ యూనుస్ లబ్ధిదారులకు సన్న బియ్యాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మొహమ్మద్ యూనుస్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయ కత్వంలో తెలంగాణలోని సబ్బండ వర్గాలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను రేవంత్ సర్కార్ నెరవేరుస్తుం దని,ప్రతిపక్షాలు ప్రతి విషయాన్ని రాద్ధాంతం చేయడం వారు 10 ఏళ్లలో చేసింది ఏమీ లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో డీలర్ అబ్దుల్ రెహమాన్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.