
Eruvaka
అన్నదాతల ఆట పాటలతో సంబురంగా ఏరువాక పౌర్ణమి
జహీరాబాద్ నేటి ధాత్రి:
వర్షాలు విరివిగా కురవాలని, పంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలు సుఖ సంతోషాలతో జీవనం కొనసాగించాలని కోరుతూ.. మండలంలోని అన్నదాతలు వర్ణ దేవుని వేడుకున్నారు. బుధవారం ఏరువాక పౌర్ణమి శుభ సందర్భంగా రైతులు, కౌలు రైతులు గ్రామ దేవతలకు ప్రత్యేకంగా దర్శించుకుని ఆట పాటలతో సందడి చేశారు. మండల కేంద్రమైన న్యాల్ కల్, మండలంలోని మల్గి,గ్రామంలో పండగను ఘనంగా జరుపుకున్నారు. పశు సంపద, వ్యవసాయ పరికరాలు, వ్యవసాయ యంత్రాలకు ప్రత్యేక పూజలు చేశారు. కోడెదూడలు, ఎద్దులను, గోమాతలకు ప్రత్యేకంగా అలంకరించి ఆలయాల చుట్టూ ప్రదక్షిణలు చేశారు.
