
దుల్మీట నేటిధాత్రి….
సిద్దిపేట జిల్లా దూల్మిట్ట మండలంలోని జాలపల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ చొప్పరి వరలక్షి సాగర్ చేతుల మీదుగా 33 లక్షల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది. అంగన్వాడీ బీల్డింగ్ 6లక్షల 50వేల రూపాయలు, ముదిరాజ్ కమ్యూనిటీ హల్ కు 16 లక్షల 50వేలు,సీసీ రోడ్డుకు 10 లక్షల రూపాయలతో ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాలపల్లి గ్రామ అభివృద్ధికి 33 లక్షల రూపాయలు మంజూరు చేసిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి,ఎమ్మెల్సీ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ అధ్యక్షులు బండ ప్రకాష్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు, ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి గిరి కొండల్ రెడ్డి,ఎంపీటీసీ కల్యాణి కమలాకర్,డైరెక్టర్ నారోజు శ్రీనివాస్,ఉపసర్పంచ్ రాగల సంపత్,మాజీ సర్పంచ్ గంగాధర్,రాంరెడ్డి,వార్డు సభ్యులు,రైతు కో ఆర్డినేటర్ కాశే రాములు,ప్రధానోపాధ్యాయులు జయచేద్రం,డీలర్ మాల్లారెడ్డి, ఫీల్డ్ అసిస్టెంట్ కవిత,మాజీ డైరెక్టర్ బాలయ్య,వైస్ చైర్మన్ నిల యాదగిరి,అంగన్వాడీ టీచర్ పద్మ,బీఆర్ఎస్ నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.