కొప్పుల ఈశ్వర్
గొల్లపల్లి, నేటి ధాత్రి: తెలంగాణ ధీర వనిత, మహిళా లోకానికి స్ఫూర్తినిచ్చిన చాకలి (చిట్యాల) ఐలమ్మ జయంతి సందర్భంగా జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలో గల చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్. అనంతరం పలు గ్రామాల్లో వివిధ కారణాలతో మృతి చెందిన కుటుంబాలను పరామర్శించారు. గొల్లపల్లి మండలంలోని చిల్వా కోడూర్ గ్రామానికి చెందిన మెడపట్ల గంగయ్య అనారోగ్యంతో మృతి చెందగా వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. తిరుమలాపూర్ గ్రామానికి చెందిన పబ్బా రవీందర్ కొన్ని రోజుల క్రితం గుండె నొప్పితో మృతి చెందగా, అలాగే శ్రీరాములపల్లి గ్రామ మాజీ వార్డ్ మెంబర్ అనిల్ తల్లి తరాల్ల బుచ్చి రాజవ్వ ఆరోగ్యంతో మృతిచెందగా వారి కుటుంబాలను పరామర్శించారు. రంగధాముని పల్లి గ్రామానికి చెందిన బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు క్యాతం రవీందర్ రెడ్డి అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకుని వారిని పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. వారి వెంట మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.