రాజకీయాల మీద ఉన్న ధ్యాస ప్రాజెక్టులపై లేదు

బీఆర్ఎస్ ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు మానుకోవాలి
మాజీ ఎంపీ వినోద్ కుమార్
జమ్మికుంట: నేటి ధాత్రి
రాజకీయాలపై ఉన్న ధ్యాస కాలేశ్వరం ప్రాజెక్టుపై లేదని, బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పనులపై అసత్య ప్రచారాలు మానుకోవాలని మాజీ ఎంపీ వినోద్ కుమార్ పేర్కొన్నారు. జమ్మికుంట పట్టణంలోని మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు నివాసంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాలేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్ష కోట్ల రూపాయలు గోదావరిలో కలిసాయని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రులు విమర్శించడం సరైనది కాదన్నారు. మూడు బ్యారేజీల ఖర్చు 94 58.91 కోట్ల రూపాయలని, కాలేశ్వరం ప్రాజెక్టు లోని మిగతా బ్యారేజ్ లకు లిఫ్టులకు టన్నెల్స్ కు కోసం ఖర్చయిందని అన్నారు. ఖాళీ విషయం ప్రాజెక్టు మీద కాంగ్రెస్ పార్టీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని, 1964 ఎస్సారెస్పీ ప్రాజెక్టు తర్వాత కాంగ్రెస్ నాయకులు ఏ ఒక్క ప్రాజెక్టు కట్టలేదన్నారు. కెసిఆర్ వచ్చిన తర్వాత కాలేశ్వరం దేవాదులతోపాటు ఎన్నో ప్రాజెక్టులు కట్టడం జరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వం దోసెడు నీళ్ల గురించి ఆలోచిస్తే కెసిఆర్ బిందెడు నీళ్ల కోసం ఆలోచించి పనులు చేశారని అన్నారు. కాలేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ బ్యారేజీ లో పిల్లర్లు రిపేర్ చేయాలని డ్యామ్ సేఫ్టీ అథారిటీని ఏ ఒక్క కాంగ్రెస్ బిజెపి ఎంపీలు ఎందుకు అడగలేదని ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో కాలేశ్వరం ప్రాజెక్టు ఉచిత విద్యుత్ తో నడుస్తుందని, సోలార్ పవర్ తో ఇరిగేషన్ స్టార్ట్ అవుతుందన్నారు. అనంతరం ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ దళిత బంధు ఎన్నికల తర్వాత ఇస్తామని చెప్పి ఇప్పటివరకు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తుందని, రైతుబంధును ఇప్పటికీ రైతుల ఖాతాలో ఎందుకు జమ చేయలేదో చెప్పాలని ప్రశ్నించారు. రైతు రుణమాఫీ 31 వేల కోట్లు చేయాల్సి ఉండగా కేవలం 17 ,934 కోట్లు మాత్రమే రుణమాఫీ చేశారని అన్నారు. 47 లక్షల మందికి రుణమాఫీ కావలసి ఉండగా కేవలం 22 లక్షల మందికి మాత్రమే రుణమాఫీ జరిగిందని అది పూర్తిస్థాయిలో చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్, మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండా శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్లు తక్కెళ్ళపల్లి రాజేశ్వరరావు,, గందె రాధిక శ్రీనివాస్ ,మాజీ ఎంపీపీ లు రాణి సురేందర్ రెడ్డి ,మూసి పట్ల రేణుక తిరుపతిరెడ్డి పావని వెంకటేష్ పిఎసిఎస్ చైర్మన్ పొన్నగంటి సంపత్, టంగుటూరి రాజకుమార్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!