
#Jerllapalli #ReservoirOverflow #HeavyRains
అలుగు పారుతున్న జీర్లపల్లి చెరువు
◆:- ఇటీవల కురిసిన వర్షాలకు పచ్చబడిన మడి
జహీరాబాద్ నేటి ధాత్రి:
నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఝరాసంగం మండలం జీర్ణపల్లి చెరువు అలుగు పారింది. ఈసారి వర్షాలు అధికంగా కురవడం వల్ల చెరువు నిండుగా ఉప్పొంగుతోందని స్థానికులు తెలిపారు. చెరువులో నీటి ఉధృతి ఎక్కువగా ఉండటంతో అటువైపు ఎవరూ వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశారు
మండలంలో సోమవారం రాత్రి భారీ వర్షం కురిసింది.రాత్రి ఏకధాటిగా వర్షం పడటంతో పలు గ్రామాల్లో పురాతన ఇండ్లు కూలిపోయాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అవగా.. జీర్లపల్లి చెరువు అలుగు పారుతోంది. చెరువును చూసేందుకు పర్యావరణ తరలి వస్తున్నారు. స్థానిక తహసీల్దార్ తిరుమల రావు, ఎస్ఐ క్రాంతికుమార్ పటేల్ డిప్యూటీ ఎంఆర్ఓ కరుణాకర్ రావు, ఆర్ఐ రామారావు చెరువును సందర్శించారు. చెరువు అలుగు పారుతుండటం వల్ల వాహనదారులు జాగ్రత్తగా వెళ్లాలని తహసీల్దార్ సూచించారు