
Hanuman temple
హనుమాన్ మందిరాలయంలో ధ్వజస్తంభం ప్రతిష్ట.
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం మండలంలోని కమల్ పల్లి హనుమాన్ మందిర్ ఆలయంలో ధ్వజస్తంభం, శివలింగం, నందీశ్వర, బొడ్రాయి విగ్రహ ప్రతిష్ఠన గురువారం అంగరంగ వైభవంగా జరిగింది. ఆంజనేయస్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం ఉదయం 10.30 గంటలకు ప్రత్యేక పూజలు నడుమ, వేదపండితుల మధ్య దంపతులచే యజ్ఞం, పూర్ణాహుతి, మహాకుంభసంప్రోక్షణ, మహాదీక్షాశీర్వచనములు చేశారు.