Birsa Munda: Tribal Freedom Flame
స్వయం పాలన నినాదం తో తెల్లదొరల పైకీ తొలి ఆదివాసీ బాణం-బిర్స ముండా
ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ ఆధ్వర్యంలో బిర్స ముండా 150 వ జయంతి
కొత్తగూడ,నేటిధాత్రి :
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రం లో అంబేద్కర్ సెంటర్ నందు ఆదివాసీ హక్కుల పోరాట సమితి “తుడుం దెబ్బ” ఆధ్వర్యంలో ఘనంగా బిర్స ముండా 150 వ జయంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది.కార్యక్రమన్ని ఉద్దేశించి ఆదివాసీ నాయకులు మాట్లాడుతూ…
బ్రిటిష్ పాలనను తొలిసారి వ్యతిరేకించి స్వయంపాలన నినాదంతో భారతదేశంలోని ఆదివాసి ప్రజల తొలి పోరాట స్ఫూర్తి ప్రధాత “బిర్స ముండా” బిర్స ముండా భారతీయ గిరిజన స్వాతంత్ర సమరయోధుడు మరియు జానపద నాయకుడు బిర్స 19వ శతాబ్దంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ముండా తిరుగుబాటుకు నాయకత్వం వహించాడు.నవంబర్ 15 1875 బెంగాల్ ప్రెసిడెంట్ లోని ఉలిహట్ (ప్రస్తుతం ఝార్ఖండ్ రాష్ట్రం లో ఉంది) ముండా తెగకు చెందిన సుగుణ ముండ-కర్మి హాటు దంపతులకు బీర్సా జన్మించాడు.ఈ యోధుడు భూమి కోసం, భుక్తి కోసం ఆదివాసీల అటవీ హక్కుల కోసం చివరి శ్వాస వరకు ఉద్యమించాడు.బిర్స ముండా బాల్యంలో చదువుకోవాలంటే క్రిస్టియన్ మతంలోకి చేరాలి అని బ్రిటిష్ వారు రూల్స్ పెట్టారు.ఆ నిబంధనలు నచ్చని బీర్సా బ్రిటిష్ వారి ఆగడాలకు దోపిడీలకు అణిచివేతలు చూస్తూ పెరిగి పెద్దవాడు అయ్యాక ఆదివాసీ ప్రజల పేదరికన్ని బాధలను చూసి బ్రిటిష్ వారి నుండి తమ తెగ ప్రజలకు స్వయo పాలన కావాలని స్వేచ్ఛగా బ్రతకాలని బ్రిటిష్ వారికీ వ్యతిరేకంగా పోరాటం మొదలు పెట్టాడు.
1886-1894 నాటి సర్ధారీ ఉద్యమం బిర్స ముండా తిరుగు బాటుకు ఆధారం. ఇది భూమిజ్-ముండా ముఖ్య నాయకుల నాయకత్వం లో పోరాడింది.1894 అక్టోబర్ 01 బ్రిటిష్ వారి పై పన్ను మాఫీ కోసం ఉద్యమం. 1895లో బీర్సా అరెస్టు అయి రెండు సంవత్సరాలు “హాజరిబాగ్” సెంటర్ జైలు లో శిక్ష అనంతరం జైలు నుంచి బయటికి వచ్చాక బీర్సముండా తన తెగ ప్రజలకు నైతిక విలువలు గిరిజన సాంసృతి-సంప్రదాయాలు ఆచరించాల్సిన అవసరాన్ని వివరించారు.మన దేశ సంస్కృతి సంప్రదాయాలను పాటించాలని సూచించాడు. ఆరోజుల్లో తెల్లోళ్లు వాళ్ళ తాబేధార్లు ఆదివాసిల సాగు భూములకు పన్నులు విధించేవారు. వాటిని కట్టకపోతే ఆ భూములను జమీందారు భూములుగా మార్చేవారు. దీంతో చాలామంది ప్రజలు అస్సాంలోని తేయకు తోటల్లో కూలి పనుల కోసం వలస వెళ్లేవారు దీన్ని గమనించిన బిర్స ముండా వనజీవులందరినీ సమావేశపరిచి బ్రిటిషర్ల కప్పాలపై తిరుగుబాటు జెండా ఎగరేశాడు. తెల్లోలను తరిమికొట్టాలని పిలుపునిచ్చాడు. అనుచరులతో కలిసి బాణాలు వీళ్ళంబులు ఆయుధాలు ధరించి 1899 డిసెంబర్ 24 న భారీ ” ఉల్ గులాన్ “(తిరుగుబాటు ర్యాలీ)నిర్వహించాడు. ఈ చర్యలను గమనించిన బ్రిటిష్ ప్రభుత్వం కుట్ర చేసి 1900 సంవత్సరంలో ఫిబ్రవరి 3న బంధించి రాంచి జైలుకు తరలించి అక్కడ గుట్టు చప్పుడు కాకుండా విశాప్రయోగం చేసి బలి తీసుకున్నారు.పట్టుమని పాతికేళ్లు కూడా నిండని వయసులోనే దేశాన్ని పరాయి పాలన నుంచి విడిపించడం కోసం పరితపించిన ఒక ఆశాజ్యోతి బందీ ఖానాలో నాలుగు గోడల మధ్య 1900 జూన్ 9న ఆరిపోయింది.అనంతర కాలంలో బీర్సాస్ఫూర్తితో ముండా, ఓరియన్,సంతాలు తెగలు తమ హక్కులను సాధించుకున్నారు,ఈశాన్య రాష్ట్రాలకు చెందిన గిరిజనులకు స్వయంపాలన అధికారం రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్ ద్వారా లభించింది.తరువాత వందేళ్ళకు (2000 నవంబర్ 15 న) ఆయన జయంతి నాడు దేశంలో 28వ రాష్ట్రంగా జార్ఖండ్ ఏర్పడింది.
ఆ రాష్ట్ర ప్రభుత్వం బిర్స ముండా సేవలను తగిన విధంగానే గుర్తు చేసుకుంటుంది.ఝార్ఖండ్ రాజధాని రాంచీలో బిర్స ముండా పేరిట ఒక యూనివర్సిటీ,ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్,కాలేజీలు,పోస్టల్ స్టాంపులు,ఇతర ప్రభుత్వ సంస్థలను నెలకొల్పింది. ఆదివాసి విప్లవ వీరుడు బిర్స ముండా నాటి బీహార్ లోని “దోమరి హిల్స్” తన పోరాటాన్ని ప్రారంభించాడు. ఆ కొండల నుంచే అప్పటి బ్రిటిష్ పాలకులపై అయన యుద్ధo మొదలుపెట్టాడు. దీంతో బీర్స ముండా పోరాటాన్ని గుర్తు చేసుకుంటూ ఇక్కడి కొండల్లో ఓ స్మారక స్థూపాన్ని ఏర్పాటు చేశారు.
బిర్స ముండా జయంతిని భారత ప్రభుత్వం నవంబర్ 15 2021 నుండి “జన జాతీయ గౌరవ్ దివాస్” గ ప్రకటించి ప్రతి సంవత్సరం జరుపుకుంటుంది.
దేశ రాజధాని ఢిల్లీ లోని సరయ్ కాలే ఖాన్ పేరు ని “బిర్స ముండా చౌక్” గ ఇటీవల మార్చబడింది.
బిర్స ముండా భారతీయ ఆదివాసీ స్వాతంత్ర సమర యోధుడు, జానపద నాయకుడు భారత స్వతంత్ర ఉద్యమ చరిత్రలో ఒక ప్రముఖ వ్యక్తిగా నిలిచిపోయాడు ఇతడి గౌరవార్థం భారత పార్లమెంటులోని సెంట్రల్ హాల్లో ఈయన చిత్రపటం ఉంది
ఈ విధంగా గౌరవించబడిన ఏకైక ఆదివాసి పోరాట యోధుడు “బిర్సముండా”.కార్యక్రమం లో ఆదివాసీ హక్కుల పోరాట సమితి “తుడుం దెబ్బ” రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అగబోయిన రవి.నాయకులు కుంజ నర్సింగ రావు పూనేం సందీప్ ఈక విజయ్ మల్లెల సారయ్య ఆదివాసీ ఉద్యోగ సంఘం నాయకులు,ATF జిల్లా అధ్యక్షులు సిద్ధ బోయిన బిక్షం,కంగాల లక్ష్మీ నర్సు, సిద్ద బోయిన లక్ష్మి నారాయణ (డీలర్)ఆదివాసీ ప్రజా ప్రతినిధులు వజ్జ సారయ్య ఇర్ప రాజేశ్వర్ రావు తోలేం అనంత రావు ఆదివాసీ దొర పటేల్లా సంఘం వట్టం శ్రీను బాబు ఆదివాసీ నాయకులు కల్తీ రంజిత్ వట్టం నరేష్ తదితరులు పాల్గొన్నారు.
