
"First CRUSH Center Inaugurated in Mulugu"
ములుగు జిల్లా లోని జగ్గన్నపేట గ్రామంలో క్రష్ కేంద్రం ఏర్పాటు
#క్రష్ కేంద్రం లో పిల్లల సంరక్షణ.
#పల్నా పథకం ద్వారా జిల్లాలో 25 డే-కేర్/క్రెచ్ కేంద్రాలు ఏర్పాటుకు చర్యలు.
#రాష్ట్రంలో మొదటిసారిగా ములుగు జిల్లా లోని జగ్గన్నపేట గ్రామం లో క్రష్ కేంద్రం ఏర్పాటు.
రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క.
ములుగు జిల్లా, నేటిధాత్రి :
క్రష్ కేంద్రాలు పిల్లల సంరక్షణ సేవలను అందించేందుకు, పగటిపూట తమ పిల్లలను చూసుకోలేని తల్లిదండ్రులు ఇట్టి కేంద్రాలను ఉపయోగించుకోవాలని
రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు.
సోమవారం ములుగు మండలం జగన్నపేట గ్రామంలో రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క, అదనపు కలెక్టర్ రెవిన్యూ సి హెచ్ మహేందర్ జి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవి చందర్ లతో కలసి అంగన్వాడి మరియు డే కేర్ కేంద్రం ప్రారంభోత్సవం చేశారు.
అనంతరం అంచనా 15 లక్షల నిధులతో అంగన్వాడి భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్బంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, సరైన క్రష్ కేంద్రాలు లేకపోవడం తో తరచుగా, మహిళలు బయటకు వెళ్లి పని చేయడానికి ఇబ్బందిగా మారిపోయిందని, తమ పిల్లలకు సరైన పిల్లల సంరక్షణ మరియు రక్షణ కల్పించడంలో పనిచేసే తల్లులు ఎదుర్కొంటున్న
ఈ ఇబ్బందులను పరిష్కరించడానికి, పల్నా పథకం ద్వారా డే-కేర్/క్రష్ కేంద్రాలు ఉపయోగపడుతాయని తెలిపారు. 7 నెలల నుండి 3 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు సురక్షితమైన వాతావరణంలో నాణ్యమైన క్రేష్ సౌకర్యాలను అందించబడుతాయని పోషకాహారo, పిల్లల ఆరోగ్యం, పెరుగుదల పర్యవేక్షణ వంటి సేవలు డే-కేర్/క్రెచ్ కేంద్రాలు అందిస్తాయని తెలిపారు.
ములుగు జిల్లా లో ములుగు, తాడ్వాయి, ఏటూరునాగారం వెంకటాపురం (04) ఐ సి డి ఎస్ ప్రోజెక్టుల పరిధిలో పల్నా పథకం ద్వారా 25 డే-కేర్/క్రెచ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని, తల్లి తండ్రులు ఈ కేంద్రాలను ఉపయోగించు కోవాలని సూచించారు.
ఈ కార్యక్రమం లో జాయింట్ డైరెక్టర్, మహిళా, శిశు సంక్షేమ శాఖ హైదరాబాద్ వినోద్, ఆర్డీఓ వెంకటేష్, జిల్లా సంక్షేమ అధికారి టి. రవి, తెలంగాణ స్టేట్ లీడర్ మొబైల్ క్రష్ మాణికప్ప, ప్రోగ్రాం ఆఫీసర్ మొబైల్ క్రష్, రాంప్రసాద్, సీడీపీఓ ములుగు కె.శిరీష, ఐ సి డి ఎస్ సూపర్ వైజర్, అంగన్వాడీ టీచర్స్, ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు, విద్యార్థులు, తదితరులు తదితరులు పాల్గొన్నారు.