# మోకుదెబ్బ అధ్వర్యంలో ఘనంగా పాపన్న వర్ధంతి వేడుకలు.
నర్సంపేట/దుగ్గొండి,నేటిధాత్రి :
తొలి బహుజన వీరుడు శ్రీశ్రీశ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ అని గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ నర్సంపేట డివిజన్ అధ్యక్షుడు కందుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు.మంగళవారం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 314 వ వర్ధంతిని పురస్కరించుకొని దుగ్గొండి మండలంలోని మల్లంపల్లి గ్రామంలో గల తాటి వనంలో మోకుదెబ్బ మండల అధ్యక్షుడు తడుక కొమురయ్య గౌడ్ అధ్వర్యంలో మల్లంపల్లి గౌడ సంఘం అధ్యక్షుడు, మోకుదెబ్బ మండల ఉపాధ్యక్షులు గుండెబోయిన రమేష్ గౌడ్ అధ్యక్షతన వేడుకలు నిర్వహించారు.ముఖ్య అతిథిగా గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ నర్సంపేట డివిజన్ అధ్యక్షుడు కందుల శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు.పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ సబ్బండ బహుజన వాదనను ఏకం చేసి రాజ్యాధికారం చేపట్టిన మొదటి వ్యక్తిగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చరిత్ర పుటల్లో నిలిచారని పేర్కొన్నారు. గౌడ కులస్తులు ఐక్యంగా ఉన్నప్పుడే అన్ని హక్కులను సాధించుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో మల్లంపల్లి గౌడ సంఘం ఉపాధ్యక్షుడు కక్కెర్ల రామకృష్ణ గౌడ్, మోకుదెబ్బ డివిజన్ నాయకులు కెక్కెర్ల సదానందం గౌడ్,కెక్కెర్ల కుమారస్వామి గౌడ్,గైని రాములు గౌడ్,కెక్కెర్ల రాజు గౌడ్,కెక్కెర్ల సాంబయ్య గౌడ్,కందుల కుమారస్వామి గౌడ్,కక్కర్ల బిక్షపతి గౌడ్,కెక్కెర్ల సారంగం గౌడ్,కెక్కెర్ల సాంబమూర్తి గౌడ్,రమేష్ గౌడ్,సతీష్ గౌడ్,మధు గౌడ్ లతో పాటు పలువురు గౌడ కులస్తులు తదితరులు పాల్గొన్నారు.