Fierce Lion Fight Shocks the Internet
మృగరాజుల భీకర పోరు.. వాటి గర్జన సౌండ్ వింటే ఆశ్చర్యపోవాల్సిందే..
వన్య ప్రాణులకు సంబంధించిన వీడియోలు చాలా మందిని ఆకర్షిస్తున్నాయి. తాజాగా ఓ రెండు సింహాల మధ్య జరిగిన పోరుకు సంబంధించిన వీడియో నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని ఆసక్తికరంగా, మరికొన్ని ఫన్నీగా ఉంటూ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా వన్య ప్రాణులకు సంబంధించిన వీడియోలు చాలా మందిని ఆకర్షిస్తున్నాయి. తాజాగా ఓ రెండు సింహాల మధ్య జరిగిన పోరుకు సంబంధించిన వీడియో నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది
అనే ఎక్స్ యూజర్ ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. అడవిలో ఒక మగ సింహం, ఒక ఆడ సింహం మధ్య గొడవ మొదలైంది. రెండూ ఒకదానిపై ఒకటి దాడి చేసుకుంటుండగా, మధ్యలో మూడో సింహం రంగ ప్రవేశం చేసింది. దీంతో ఆ పోరు మధ్యలోనే ముగిసింది. అయితే ఆ సింహాలు చేసిన గర్జనలు మాత్రం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. సింహాల భీకర శబ్దాలు అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్గా మారింది (wildlife fight shocking video).
