# మద్యంతాగి వేధిస్తున్నాడని భర్తను హతమార్చిన భార్య,కొడుకు కూతురు.అల్లుడు.
# దుగ్గొండి మండలం మైసంపల్లిలో ఘటన
# కొడుకు ప్రశాంత్ ఫిర్యాదుతో భార్యతో పాటు మరో కొడుకు, కూతురు,అల్లుడు,బంధువుపై కేసు నమోదు.
# దుగ్గొండి సీఐ శ్రీనివాస్ నాయక్.

నర్సంపేట,నేటిధాత్రి :
మద్యానికి బానిసై భార్యను అనుమానిస్తూ నిత్యం వేధిస్తున్న భర్తపై
తన కూతురు, కొడుకు, అల్లుడు మరో బంధువుతో కలసి భర్తను హత్య చేసిన సంఘటన వరంగల్ జిల్లా దుగ్గొండి మండలంలోని మైసంపల్లి గ్రామంలో శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.దుగ్గొండి సీఐ శ్రీనివాస్,కుటుంబ సభ్యులు, గ్రామస్తులు,తెలిపిన వివరాల ప్రకారం
దుగ్గొండి మండలంలోని మైసంపల్లి గ్రామానికి చెందిన జేరిపోతుల రాజు మద్యానికి బానిసై బార్య నిత్యం వేధింపులకు పాల్పడుతున్న భర్తను క్షణికావేశంలో భార్య హత్య చేసిన సంఘటన సిఐ శ్రీనివాస్ కుటుంబ సభ్యులు గ్రామస్తుల కథనం ప్రకారం దుగ్గొండి మండలంలోని మైసంపల్లి గ్రామానికి చెందిన జేరిపోతుల రాజు గత కొన్ని నెలలుగా మద్యానికి బానిసై బార్య లక్ష్మిపై అనుమానిస్తూ నిత్యం కుటుంబ సభ్యులతో గొడవ పడేవాడు. ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి మద్యం సేవించిన రాజు భార్యతో గొడవ పడ్డాడు.దీంతో బార్య 100 కు పోన్ చేయగా పోలీసులు చేరుకొని గొడవ సర్దిమనిగేల చేసి వెళ్ళిపోయారు.అనంతరం రాజు మరల గొడవకు దిగన నేపథ్యంలో కోపోద్రిక్తురాలైన రాజు భార్య లక్ష్మి ప్రతి దాడి చేసింది.అలాగే బార్య లక్ష్మి,చిన్న కొడుకు సూర్య, కూతురు మాధవి,అల్లుడు రాకేష్,మరియు వారి బంధువు తరుణ్ అనే ఐదుగురు కలిసి రాళ్లతో కోట్టి వైరుతో ఉరివేసి చంపినారు.కాగా తెల్లవారుజామున రాజు మృతి చెందినట్లు స్థానికులు గుర్తించగా ముందుగానే బార్య దుగ్గొండి పోలీస్ స్టేషన్ కు వెళ్లి తన భర్తను హత్య చేసినట్లు లొంగిపోయింది.దీంతో సమాచారం అందుకున్న దుగ్గొండి సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఎస్సై పరమేష్ ఘటనా స్థలానికి సిబ్బందితో చేరుకుని విచారణ చేశారు.మృతుని పెద్ద కుమారుడు ప్రశాంత్ పిర్యాదు మేరకు
భార్య లక్ష్మి, కొడుకు సూర్య, అల్లుడు రాకేష్, కూతురు మాధవి,మరో బంధువు తరుణ్ అనే ఐదుగురు
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శ్రీనివాస్ తెలిపారు.
