ప్రాథమిక పాఠశాలలోనే పరీక్ష కేంద్రాన్ని కొనసాగించాలి.

#తాసిల్దార్ రాజేష్ కు వినతి పత్రం అందజేత.

#కార్పొరేట్ విద్యాసంస్థలకు వత్తాసు పలుకుతున్న విద్యాశాఖ అధికారులు.

#ఏ బి ఎస్ ఎఫ్ జిల్లా కార్యదర్శి బోట్ల నరేష్.

నల్లబెల్లి, నేటి ధాత్రి: మండల కేంద్రంలో గత పది సంవత్సరాల నుండి ఎంతోమంది విద్యార్థులు ప్రాథమిక ఉన్నత పాఠశాలలో పదో తరగతి పరీక్షలు రాసి ఉన్నత స్థాయి చదువులు చదివి వివిధ రంగాలలో అత్యున్నత స్థాయిలో ఉన్నారు అలాంటి చరిత్ర ఉన్నప్రాథమిక పాఠశాలలో సరిగ్గా వసతులు లేవని వేరొక ప్రైవేట్ పాఠశాలకు పదో తరగతి పరీక్ష కేంద్రం కేటాయించడంలో విద్యాశాఖ అధికారుల ఆంతర్యం ఏమిటని ఏ బి ఎస్ ఎఫ్ జిల్లా కార్యదర్శి బొట్ల నరేష్ అన్నారు . శనివారం తాసిల్దార్ బోనగాని రాజేష్ కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన ఊరు మన బడి ప్రణాళికలో భాగంగా నల్లబెల్లి ప్రాథమిక ఉన్నత పాఠశాల లో మెరుగైన సదుపాయాలు గత సంవత్సరం నిధులు కేటాయించి విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా మంచినీటి సౌకర్యం, మరుగుదొడ్లు , విద్యార్థులకు బెంచులు, స్కూల్ చుట్టూ ప్రహరీ గోడ నిర్మించారు అలాంటి స్కూల్లో ఎలాంటి వసతులు లేవని పరీక్ష కేంద్రాన్ని వేరే ప్రైవేట్ స్కూలుకు కేటాయించడం చాలా బాధాకరమని అన్నారు ఈ విషయంపై జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో పదో తరగతి పరీక్ష కేంద్రాన్ని కొనసాగించి పరీక్షలు నిర్వహించాలని లేని పక్షాన విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేపడతామని ఆయన డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *