ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు అభినందనీయం.
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు.
చిట్యాల, నేటి ధాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవికాలంలో ప్రజల దాహార్తి తీర్చేందుకు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం మంచి కార్యక్రమం అని జర్నలిస్టులు వార్తలకే పరిమితం కాకుండా సామాజిక సేవ చేయడం అభినందనీయమని అలాగే పాత్రికేయులు కీర్తిశేషులు మాస్ రాజయ్య రామ్ రెడ్డి స్మారకార్థం ఈ యొక్క చలివేంద్రం ఏర్పాటు చేయడం గొప్ప విషయమని కొనియాడారు, ఈ చలివేంద్రానికి సహకరించిన దాతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు, ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గూట్ల తిరుపతి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మడి శ్రీదేవి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి దొడ్డికిష్టయ్య జిల్లా కార్యదర్శి మధు వంశీకృష్ణ మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మూల శంకర్ గౌడ్ మాజీ ఎంపిటిసి దబ్బేట అనిల్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు అల్లకొండ కుమార్. కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షులు బుర్ర లక్ష్మణ్ గౌడ్, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కాట్రేవుల ఐలయ్య, జర్నలిస్టులు రమేష్ రామచంద్ర మూర్తి, రవితేజ, సత్యం , రాజశేఖర్, కట్కూరి శ్రీనివాస్, బుర్ర రమేష్ రాజమౌళి,బొల్లరాజేందర్, సరిగొమ్ముల రాజేందర్ ,రంగన్న సంపత్, తదితరులు పాల్గొన్నారు