సిరిసిల్ల(నేటి ధాత్రి):
భారత కమ్యూనిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర పిలుపులో భాగంగా, తెలంగాణా రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలను పురస్కరించుకొని రాజన్న సిరిసిల్ల సీపీఐ పార్టీ జిల్లా కార్యాలయంలో వారోత్సవాల ముగింపు సభను నిర్వహించడం జరిగింది. బద్దం ఎల్లారెడ్డి చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సభకు పంతం రవి అధ్యక్షత వహించడం జరిగింది. ఈ సమావేశాన్ని ఉద్దేశించి సీపీఐ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ గుంటి వేణు మాట్లాడుతూ 1947 ఆగస్టు 15 న దేశానికి స్వాతంత్రం వచ్చినా, తెలంగాణా మాత్రం నిజాం నియంతృత్వంలోనే ఉందని అణిచివేత లను,నిర్బందాలు,హింసలు ఎన్ని ఎదురైన భూమికోసం,భుక్తికోసం,విముక్తి కోసం కామ్రేడ్ రావి, నారాయణరెడ్డి,కామ్రేడ్ బద్దం ఎల్లారెడ్డి,కామ్రేడ్ ముగ్ధుమ్ మొయినోద్దీన్ పిలుపుతో బందూకులు, బరిశెలు,కారం,గొడ్డన్లు అందుకొని తెలంగాణ ప్రజలు నిజాం నవాబు నిరంకుశత్వానికి వ్యతిరేకంగా భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో పోరాటాలు చేశారన్నారు.1947 నుండి1948 సెప్టెంబర్ 17న తెలంగాణాకు విమోచనం లభించేంతవరకు ఎనలేని పోరాటాలు సీపీఐ చేసిందన్నారు. ఇందులో భాగంగా 3000 గ్రామాలు విముక్తం చేసే క్రమంలో,4500 మంది తెలంగాణా రైతాంగ సాయుధ పోరాట వీరులు అసువులు భాసారని వారిని స్మరించుకోవడం కోసమే సెప్టెంబర్ 11 నుండి 17 వరకు తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలని నిర్వహిస్తున్నామని తెలిపారు.ఈ ప్రాంతానికి చెందిన బద్దం ఎల్లారెడ్డి,సింగిరెడ్డి భూపతిరెడ్డి,అనభేరి ప్రభాకర్,గడ్డం తిరుపతి రెడ్డి వంటి వారి జీవిత చరిత్రను భవిష్యత్ తరాలకు తెలువడం కోసం పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని అన్నారు.బద్దం ఎల్లారెడ్డి,సింగిరెడ్డి భూపతిరెడ్డిల విగ్రహాలను సిరిసిల్లలో ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్బంగా డిమాండ్ చేశారు.తెలంగాణా రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలను అధికారికంగా నిర్వహించాలన్నారు.ఈ సమావేశంలో సీపీఐ నాయకులు కామ్రేడ్ కడారి రాములు నల్ల చంద్రమౌళి,అజ్జ వేణు, కే.వి అనసూర్య,సోమ నాగరాజు,తిరుపతిరెడ్డి,మంత్రి చంద్రయ్య, గాజుల పోశెట్టి,
ఎల్ల సత్తమ్మ, తదితర నాయకులు సీపీఐ పార్టీ కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.