ఎస్సీల వర్గీకరణ అమలైన తర్వాతనే ఉద్యోగ ప్రక్రియను అమలు చేయాలి
రెండవ రోజుకు చేరిన ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి రిలే నిరాహార దీక్షలు
వర్ధన్నపేట,నేటిధాత్రి:
వర్ధన్నపేట నియోజకవర్గ కేంద్రంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర బుధవారం రోజున ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి మరియు అనుబంధ సంఘాల నిరాహార దీక్షలు ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు ఎర్ర సంతోష్ మాదిగ అధ్యక్షతన రెండో రోజు కొనసాగడం జరిగింది . ఈ దీక్షకు ముఖ్య అతిథులుగా ఎమ్మార్పీఎస్ వరంగల్ జిల్లా సీనియర్ నాయకులు గోలి సుధాకర్ మాదిగ హాజరై మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌరవ రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకోవాలని ఎస్సీల వర్గీకరణ అమలు చేసిన తర్వాతనే ఇప్పుడు ప్రకటించినటువంటి ఉద్యోగాలు ఎస్సీల వర్గీకరణ అమలైన తర్వాతనే ఈ ఉద్యోగ ప్రక్రియను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నా లేని పక్షంలో పద్మశ్రీ మందా కృష్ణ మాదిగ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఉప కులాలను అన్నిటిని కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరిస్తున్నాం
ఈ కార్యక్రమంలో ముత్యాల మల్లేష్ మాదిగ ఎంఎస్పి వర్ధన్నపేట మండల అధ్యక్షులు , సినపెల్లి రాజు మాదిగ ఎమ్మార్పీఎస్ వర్ధన్నపేట మండల అధికార ప్రతినిధి , ముత్యాల నులేందర్ మాదిగ , సిలువేరు రాజు మాదిగ కడారి గూడెం గ్రామ అధ్యక్షులు , కంచర్ల రంజిత్ కుమార్ మాదిగ ఎమ్మార్పీఎస్ నాయకులు , బీరెల్లి నాగార్జున మాదిగ ఎమ్మార్పీఎస్ నాయకులు , పసునూరు సాయిలు మాదిగ తదితరులు పాల్గొన్నారు
ఉద్యోగ ప్రక్రియను అమలు చేయాలి.!
