తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ఒక సంచలనం
కందుకూరి నరేష్ వరంగల్ పార్లమెంట్ కార్యదర్శి
పరకాల నేటిధాత్రి
తెలుగుదేశంపార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పరకాల పట్టణ కేంద్రంలో టౌన్ ప్రైసిడెంట్ చీదురాల రామన్న శంకర్, స్వామి ఆధ్వర్యంలో ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వరంగల్ పార్లమెంట్ కార్యదర్శి పరకాల నియోజకవర్గం బాధ్యులు కందుకూరి నరేష్ మాట్లాడుతూ భారత దేశ చరిత్రలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ఒక సంచలనం అని అన్నారు.కాంగ్రేస్ పార్టీ పాలనలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మతకలహాల తో,నెలకో ముఖ్యమంత్రి ని మారుస్తు పాలన గాలికొదిలేసిన సందర్బం లో పార్టీ స్థాపించిన 9నెలల్లోనే అధికారంలోకి వచ్చిన ఘణత తెలుగుదేశం పార్టీ కే దక్కిందన్నారు.తెలుగుదేశం ఆవిర్భావం ఒక సంచలనమని ప్రగతి ప్రజాసంక్షేమం కోసం ఉద్భవించిన పార్టీ తెలుగుదేశమని,పేదవారి ఆకలి తీర్చేందుకు స్వర్గీయ అన్న నందమూరి తారకరామారావు రెండు రూపాయలకే కిలో బియ్యం అందించారన్నారు.సమాజమే దేవాలయం-ప్రజలే దేవుళ్లు అని నినదించారు.వెనుకబడిన, బడుగు బలహీనవర్గాలను సామాజికంగా,ఆర్ధికంగా, రాజకీయంగా ఆదుకొని అక్కున చేర్చుకున్న పార్టీ తెలుగుదేశం కొనియాడారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి ఆటు పోట్లు సహజమే అని మొక్కవోని దీక్షతో పనిచేసే కార్యకర్తలు ఉన్న పార్టీ తెలుగుదేశం మేనని అన్నారు.రాబోయో రోజుల్లో తెలంగాణ లో సైతం అధికారంలోకి రావడానికి కృషిచేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ దామెర మండలం నాయకులు, నల్ల రవి, నగేష్,జనార్దన్ రావు,నడికూడ మండలం నాయుకులు రేగురి వెంకటరెడ్డి,పరకాల పట్టణ మహిళా నాయకురాలు మెహరాజ్ బేగం,అశోక్ యువనాయకులు తదితరులు పాల్గొన్నారు.