
నర్సంపేట,నేటిధాత్రి :
తెలంగాణ పీసీసీ అధ్యక్షులుగా బొమ్మ మహేశ్వర్ గౌడ్ ను ఎంపిక చేయడం హర్షనీయమని గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల రమేష్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు.నర్సంపేట పట్టణం మోకుదెబ్బ జిల్లా కమిటీ సమావేశం పట్టణ కమిటీ అధ్యక్షులు గండి గిరి గౌడ్ అధ్యక్షతన బుదవారం జరిగింది. ఈ సందర్బంగా రమేష్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలు కృషి చేస్తున్న ఆయన సేవలను ఏఐసీసీ గుర్తించి పార్టీలో అత్యున్నతమైన పీసీసీ అధ్యక్షులుగా మహాశ్వర్ గౌడ్ ను నియమించడం జరిగిందన్నారు. విద్యార్థి స్థాయి నుండి ఒక సైనికుని వలె నిబద్దత గల కార్యకర్తగా చేసిన సేవలను గుర్తించి పదవి కట్టబెట్టడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు.గౌడ సామాజిక వర్గాన్ని గుర్తించి మహేశ్వర్ గౌడ్ పీసీసీ అధ్యక్షులుగా నియమించిన ఏఐసీసీసీ అధ్యక్షులు కార్గే, సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మోకుదెబ్బ పక్షాన కృతజ్ఞతలు తెలుపున్నట్లు రమేష్ గౌడ్ తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గౌడ సామాజిక వర్గానికి అన్ని పార్టీలు జనాభా దామాషా ప్రకారం అవకాశాలు కల్పించాలని, ఎన్నికల మేనిపెస్టో లో ప్రకటించినట్లుగా కాంగ్రెస్ పార్టీ జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పేరు నామకరణం చేయాలని రమేష్ గౌడ్ డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మోకు దెబ్బ జిల్లా అధ్యక్షులు గోపగాని వెంకట్ గౌడ్,రాష్ట్ర కార్యదర్శి మద్దెల సాంబయ్య గౌడ్,మాజీ ఎంపీపీ బూర్గు రవీందర్ గౌడ్,మాజీ ఎంపిటీసీ కట్ల సుధాకర్ గౌడ్,నాలం విజయ్ కుమార్ గౌడ్,పిఏసిఎస్ వైస్ చైర్మన్ మేరుగు శ్రీనివాస్ గౌడ్,బోడిగే వినయ్ గౌడ్, వేముల రవి గౌడ్,బుర్ర ఆనందంగౌడ్, కక్కెర్ల కుమార్ గౌడ్,బత్తిని సాంబయ్య గౌడ్,దుపాటి మల్లయ్యగౌడ్,కట్ల కనుకయ్యగౌడ్,బూడిద రవీందర్ గౌడ్, తాళ్లపెల్లి అశోక్ గౌడ్,బత్తిని అశోక్ గౌడ్,దుపాటి కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.