“DTF Calls for United Effort to Strengthen Education”
విద్యారంగాన్ని అభివృద్ధి పరచుకోవాలి
*డిటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.
లింగారెడ్డి*
నర్సంపేట,నేటిధాత్రి:
విద్యారంగాన్ని అభివృద్ధి పరచుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని, దానికి ప్రభుత్వం చొరవచూపి ఎక్కువ నిధులు కేటాయించాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.లింగారెడ్డి అన్నారు. నర్సంపేట పట్టణంలోని బాలాజీ మహిళా పీజీ, డిగ్రీ కళాశాలలో బుధవారం ఏర్పాటుచేసిన జిల్లా సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడుతూ విద్యారంగం పేదలకు అందని విధంగా తయారు కావడం జరిగిందన్నారు. పాలకులు కేటాయించవలసిన నిధుల కేటాయింపులో పక్షపాతం చూపడం తో విద్యారంగం ముందుకు పోవడం లేదన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగాన్ని మానవనరుల అభివృద్ధిలో భాగంగా కాకుండా లాభనష్టాల కోణంలో చూపడంతో నేడు విద్యారంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుందన్నారు అందరికీ విద్య అందాలనే కొఠారి కమిషన్ ను అమలు పరచకుండా వ్యాపారంగా చూడడంతో నేడు విద్యారంగం వెనుకబడిపోయిందన్నారు. గ్రామీణ ప్రాంతా బడుగు బలహీన వర్గాల చదువు కోసం ప్రభుత్వాలు శ్రద్ధ చూపకపోవడమే దీనికి ప్రధానమైన కారణం అన్నారు. విద్యారంగాన్ని కాపాడుకోవడానికి ఐక్యంగా ఉండి పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. డెమొక్ర టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర పూర్వ అధ్యక్షుడు రఘు శంకర్ రెడ్డి మాట్లాడుతూ విద్యారంగాన్ని కాపాడడం కోసం అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని పోయి ఉద్యమించవలసిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వాలు మారినప్పటికీ విద్యారంగంలో మార్పు లేదన్నారు. డిటిఎఫ్ జిల్లా అధ్యక్షులుగా పనిచేసిన కాగిత యాకయ్య పదవీ విరమణ సందర్భంగా ఆయనను డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఘనంగా అభినందించారు.ఈ జిల్లా సదస్సులో అధ్యాపక జ్వాలా సంపాదకుడు డాక్టర్ గంగాధర్, డిటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఏ. శ్రీనివాస్ రెడ్డి, బాలాజీ విద్యాసంస్థల చైర్మన్ ఏ. రాజేంద్ర ప్రసాద్ రెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ రామ్ రాజ్,జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల గోవిందరావు.జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల గోవిందరావు, నర్సంపేట ఎంఈఓ కొర్ర సారయ్య, ఉమ్మడి జిల్లా పూర్వ అధ్యక్షులు గుంటి రామచందర్, హనుమకొండ జిల్లా అధ్యక్షులు జి. ఉప్పలయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ మబూబాబాద్ జిల్లా అధ్యక్షులు నెల్లుట్ల భాస్కర్ భూపాలపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి తంగెళ్ల సుదర్శన్, జిల్లా ఉపాధ్యక్షులు దార్ల రవీందర్ రాష్ట్ర కౌన్సిలర్ కొమ్మాలు జిల్లా ఉమా శంకర్ ఉపాధ్యక్షురాలు సుధారాణి, వివిధ మండలాల బాధ్యులు ఎస్కే సర్దార్ కొర్ర రమేష్ మాలోతు జగన్ ఈదుల వెంకటేశ్వర్లు రావుల దేవేందర్ శ్యాంప్రసాద్, ఉమా శంకర్ తదితరులు పాల్గొన్నారు.
