New Booklet Exam System Introduced
శుక్రవారం.. ఇలా చేస్తే లక్ష్మీ దేవి ఆశీస్సులతో డబ్బుకు కొరత ఉండదు!
శుక్రవారం.. ఈ ప్రత్యేక పరిహారం చేస్తే లక్ష్మీ దేవి ఆశీస్సులతో డబ్బుకు కొరత ఉండదని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. అయితే, ఏ పరిహారం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతామో ఇప్పుడు తెలుసుకుందాం..
సనాతన ధర్మంలో శుక్రవారం ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. శుక్రవారం లక్ష్మీదేవికి అంకితం చేయబడిన రోజు. ఈ రోజున సంపద, శ్రేయస్సు, సంతోషాన్ని ప్రసాదించే లక్ష్మీదేవిని పూజిస్తారు. లక్ష్మీదేవిని పూజిస్తే ఇంట్లో సిరిసంపదలు, ధనధాన్యాలు పెరుగుతాయని భక్తుల నమ్మకం. ఈ ప్రత్యేక పరిహారం చేస్తే లక్ష్మీ దేవి ఆశీస్సులతో డబ్బుకు కొరత ఉండదని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. అయితే, ఏ పరిహారం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతామో ఇప్పుడు తెలుసుకుందాం..
వేప చెట్టుకు నైవేద్యం
శుక్రవారం వేప చెట్టుకు నీరు నైవేద్యం పెట్టడం వల్ల దుర్గాదేవి ఆశీస్సులు లభిస్తాయి. ఇంటికి ఆనందం, శ్రేయస్సు చేకూరుతాయి. ఇది గ్రహ దోషాల నుండి ఉపశమనం పొందేందుకు కూడా సహాయపడుతుంది.
