వీణవంక డి ఎస్ పి పార్టీ మండల కమిటీ
వీణవంక, (కరీంనగర్ జిల్లా),
నేటిదాత్రి:కరీంనగర్ జిల్లా కేంద్రంలో తేది 26.02.24 సోమవారం రోజున సంబంధిత జిల్లా కలెక్టర్ ప్రజావాణి ద్వారా రెండో విడుత దళిత బంధు నిధుల మంజూరికై ధరఖాస్తులను ఇవ్వడానికి జిల్లా కలెక్టరెట్ కు దళిత బంధు భాదితులైన హుజూరాబాద్ నియోజక వర్గ మండలాలు అయిన వీణవంక,జమ్మికుంట, ఇల్లంతకుంట, హుజురాబాద్ ప్రజలు వెళితే ఇప్పుడున్న కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం భాదితులైన మహిళలు వారి కుటుంబాలపై కఠినంగా లాఠీచార్జీ చేయడం పట్ల ధర్మ సమాజ్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది.
ఈ రాష్ట్ర ప్రభుత్వం అణగారిన కులాలైన ఎస్సీలు వారి ఉపకులాలపై చిన్న చూపు చూస్తుంది వారు భారత ప్రకారం శాంతియుతంగా తమ భాదను కలెక్టర్ కు వినతి పత్రం ద్వారా తెలియ చేయడానికి వెళ్లితే వారిని గేటు నుండి లోపలి పోనియకుండా అడ్డుకొనీ వారిపై విచక్షణ రహితంగా లాటి ఛార్జీ చేసి వారిని అక్కడి నుంచి అరెస్టులు చేసి అడ్డుకోవడం అనేది ఈ ప్రజాస్వామ్యంలో చాలా హేమమైన చర్యగా ప్రజాస్వామ్య విరుద్ధమైన పాలనగా భావిస్తున్నాం.
రెక్కాడితే డొక్కాడని కుటుంబాలపై ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం దళిత బంధు బాధితుల గొంతునొక్కే ప్రయత్నం చేయడం అనేది (డి ఎస్ పి) పార్టీ తీవ్రంగా ఖండిస్తూ, మహిళల పట్ల రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణ తెలపాలని కొరుతున్నాం.. లేనియెడల ధర్మ సమాజ్ పార్టీ రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెపుతామని హెచ్చరిస్తున్నాం.దళిత బంధు రెండో విడత నిధులు బాధితులకు అందేవరకు డి ఎస్ పి పార్టీ అండగా ఉంటామని తెలియజేశారు.. ఈ కార్యక్రమంలో డి ఎస్ పి వీణవంక మండల నాయకులు సదానందం,రాకేష్, రాజేంద్ర ప్రసాద్, వినయ్, అనిల్,రాజు,మహేష్,పృధ్వీరాజ్ తదితరులు పాల్గొన్నారు.