భూపాలపల్లి నేటిధాత్రి
ధర్మ సమాజ్ పార్టీ భూపాలపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి 03 డిమాండ్లతో కూడిన రేపెంటేషన్ కలెక్టర్ కార్యాలయంలో ఏవో కి ఇవ్వడం జరిగింది.. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు కొత్తూరు రవీందర్ మాట్లాడుతూ భారతదేశ సమస్తాన్ని అధిశాసన రూపంలో నడిపించే సుప్రీం పవర్ భారత రాజ్యాంగం అందరికీ తెలిసిన విషయమే అందుకని భారత గణతంత్ర దినోత్సవం భారత రాజ్యాంగ అమలు దినం ఐన రిపబ్లిక్ డే రోజు జనవరి 26 న జాతీయ జెండా వద్ద భారత రాజ్యాంగ గ్రంథాన్ని, దాని రూపశిల్పి డా. అంబేడ్కర్ చిత్రపటాన్ని అక్కడ ఏర్పాటు చేయాలని, ప్రతిరోజూ విద్యా సంస్థలలో విద్యార్థులు చదివే ప్రార్ధనా స్థానంలో భారత రాజ్యాంగ పీఠికను ప్రతిజ్ఞగా చదివించేలాగ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ సంస్థలను, ప్రభుత్వేతర సంస్థలను కూడా ఆదేశించాలని డిమాండ్ లేఖను రాస్తున్నామన్నారు త్వరగా అమలు నిర్ణయాన్ని జీవో ద్వారా తీసుకుంటారనీ ఆశిస్తున్నామన్నారు.
26/01/2025 నాడు జిల్లా కేంద్రంలో భారత రాజ్యాంగ రథయాత్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలియజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు చిట్యాల శ్రీనివాస్,జిల్లా ప్రధాన కార్యదర్శి మంద రమేష్ ,ఘనపూర్ మండల కన్వీనర్ కుర్రి స్వామి నాథన్ ,భూపాలపల్లి మండల నాయకులు మోకిడి అశోక్,బోయిని ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.