ఎండుతున్న వనం.. నీరుగారుతున్న లక్ష్యం

పచ్చదనంపై పట్టింపేది?

పట్టించుకోని అధికారులు

వేములవాడ రూరల్ నేటిధాత్రి

వేములవాడ రూరల్ మండలంలోని పలు గ్రామాల
పల్లెలు పచ్చని హరితవనాలుగా మారాలన్న ఉద్దేశంతో గత రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పల్లెప్రకృతి వనాల నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది. గ్రామాల్లో పచ్చదనం పరిఢవిల్లాలన్న ఉద్దేశంతో ఏర్పాటు చేసిన పల్లెప్రకృతి వనాలు ఆహ్లాదాన్ని అందించడం పల్లె ప్రకృతి వనాలపై ప్రత్యేక కథనం నేటి ధాత్రి లో
రూరల్ మండల పరిధిలోని గ్రామాల పల్లె ప్రకృతి వనాల అలనా కరువైంది పట్టించుకోని స్పెషల్ ఆఫీసర్లు
మొక్కలు, చెట్లను సంరక్షించాల్సి ఉన్నా కాంగ్రెస్‌ ప్రభుత్వంలో పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. దీంతో ఎండాకాలం ప్రారంభానికి ముందే వనాలపై ఆలనాపాలన లేకుండాపోవడంతో ఎక్కడికక్కడే ఎండిపోతున్నాయి. బోర్డులు మాత్రమే మిగులుతున్నాయి. నీటి కొరత.. పర్యవేక్షణ కొరవడడంతో ధ్వంసమవుతున్నాయి
కొన్ని చోట్ల కానరాని వనాలు మరికొన్నిచోట్ల ఎండిపోయి కలిపోతున్నాయి సంబంధిత అధికారులు కన్నెత్తి చూడకపోగా.. కనీసం పట్టించుకోవడం లేదు. గతంలో పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు, ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ సిబ్బంది సమిష్టిగా పనిచేస్తూ మొక్కలను రక్షించారు. కేసీఆర్‌ సర్కా రు గ్రామాల్లో ప్రభుత్వ భూములను గుర్తించి ఖాళీ జా గాల్లో మొక్కలు నాటేందుకు వీలుగా నర్సరీలను ఏ ర్పాటు చేశారు. ఎకరం, అర ఎకరం.. రెండెకరాలు ఎలా ఉంటే అలా పంచాయతీ పరిధిలో ప్రభుత్వ భూ ములను గుర్తించి పల్లె ప్రకతి వనాలను సృష్టించారు. మండలాల్లో 10, 15 ఎకరాల విస్తీర్ణంలో బృహత్‌ పల్లెప్రకృతి వనాలను కూడా ఏర్పాటు చేశారు. ఇవన్నీ ప్రస్తుతం ఎక్కడికక్కడే ఎండి పోయి దర్శనమిస్తున్నాయి. నీటి కొరత ప్రధాన సమస్యగా మారింది
ఒక్కో వనానికి రూ.4 లక్షలు ఖర్చు చేశారు. రెండు నెలల వరకు పచ్చదనంతో ఉన్న ఈ వనాలన్నీ ఇప్పుడు ఎండిపోయి దర్శనమిస్తున్నాయి.
కళావిహీనంగా వనాలు
పల్లెప్రకృతి వనాలకు గడ్డు కాలం ఏర్పడింది
అధికారులు, సిబ్బంది పర్యవేక్షణ లేక పచ్చదనం కొరవడుతున్నది. రేవంత్‌ సర్కారు సకాలంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించి ఉంటే ప్రకృతి వనాలకు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని స్వయంగా తాజా మాజీ సర్పంచులే చెబుతున్నారు. ప్రతి గ్రామానికి ప్రత్యేక అధికారులను నియమించినా చాలామంది గ్రామాల వైపు కన్నెత్తి చూడడం లేదన్న విమర్శలు ఉన్నాయి. జీపీలకు ఎప్పుడు వస్తారో.. ఎప్పుడు వెళ్తారో తెలియని అయోమయ పరిస్థితులు తలెత్తాయి. గ్రామాల్లో సర్పంచుల పదవీకాలం ముగిశాక గ్రామ కార్యదర్శులు పంచాయతీ భారం మోయలేకపోతున్నారు. స్పెషల్‌ ఆఫీసర్లు చెప్పినట్లు నడుచుకునే వీలుండటంతో వాళ్లు రావడం లేదు.. వీళ్లు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నయి?

వెంటాడుతున్న నీటి కొరత

గత డిసెంబర్‌లో రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో అన్నీ తలకిందులయ్యాయి. కొత్తగా అధికారంలో వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలను నిర్వహించకపోవడంతో పాలన అటకెక్కింది. ప్రత్యేక అధికారులను నియమించినా వారు పట్టించుకోకపోవడంతో మొక్కులు ఎండిపోతున్నాయి. ప్రధానంగా గ్రామాల్లో నీటి కొరత వెంటాడుతోంది. అవసరానికి సరిపడా నీళ్లు లభించడం లేదు. విద్యుత్‌ కోతలు, మోటర్లు కాలిపోవడంతో వాటి రిపేర్లకు డబ్బులు ఎవరిస్తారని పంచాయతీ కార్యదర్శులు చేతులెత్తేస్తున్నారు. దీంతో మొక్కలకు నీళ్లు పట్టకపోవడంతో ఇటు వనాలు, అటు నర్సరీలన్నీ దెబ్బతింటున్నాయి
దృష్టి సారించని స్పెషల్‌ ఆఫీసర్లు
ప్రతి వర్షాకాలంలో గ్రామాలు, మండలాలు, జిల్లాలో ఏటా లక్షల మొ క్కలను నాటుతూ హరితహారం కార్యక్రమాన్ని కేసీఆర్‌ ప్రభుత్వం పెద్ద ఎత్తున నిర్వహించింది. ఈ మొక్కలను కొనుగోలు చేసే బదులు కొంత ఖర్చు చేసి ఇక్కడే ప్లాంట్‌ తయారు చేయడమే కా కుండా.. పల్లెల్లో కూడా పార్కులు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో పల్లెప్రకతి వనాలకు శ్రీకారం చుట్టింది. దీంతో ప్రతి గ్రామంలో పల్లెప్రకృతి వనంతోపాటు గ్రామాల్లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ జాగాల్లో మొక్కలు నాటేందుకు ఇవి దోహదపడ్తున్నాయి. దీంతో ప్రభుత్వం రూ.కోట్లు ఖర్చుచేసి వీటిని నిర్మించింది. వీటి నిర్వహణ మూడు, నాలుగేళ్లుగా సాఫీగా సాగింది. గ్రామాల్లో అవసరమైన మొక్కలను పెంచి ఇవ్వడమే కాకుండా పల్లెల్లో పచ్చదనానికి దోహదపడ్డాయి. కాగా నెల రోజుల నుంచి స్పెషల్‌ ఆఫీసర్ల పాలన కొనసాగుతున్నది. దీంతో ప్రకృతి వనాలను సంరక్షించాల్సిన అధికారులు గ్రామాల్లోకి సక్రమంగా రావడం లేదు. దీంతో పర్యవేక్షణ లేక ఎక్కడికక్కడే ఎండిపోయాయి.
వచ్చే వానకాలం హరితహారానికి లక్షల్లో మొక్కలు కావాల్సి ఉంది.. వీటిని ఎక్కడ.. ఏ విధంగా సమకూరుస్తారో అధికారులకే తెలియాలి.
ఇప్పటికైనా జిల్లా అధికారులు చొరవ తీసుకొని వనాలను రక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. లేకుంటే పల్లెల్లో పచ్చదనం కరువయ్యే పరిస్థితులు రావచ్చు అని పలువురు చర్చించుకుంటున్నరు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *