ఎండుతున్న పొలాలు..! మండుతున్న రైతులు…!!

ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయాలని రైతుల డిమాండ్

నిర్లక్ష్యం చేస్తున్న సెస్ అధికారులు.

వేములవాడ రురల్ నేటి ధాత్రి వేణు

దేవుడు వరమిచ్చిన పూజారి వరం ఈయనట్టు. తయారయింది రైతుల గోడు. వరుణ దేవుడు కరుణించి పుష్కలంగా వానలు పడి చెరువులు బావులు నిండిన కరెంటు సరఫరా లేకపోవడంతో పంట పొలాలు ఎండిపోతున్నాయి సమస్యను పరిష్కరించాల్సిన అధికారులు పాలకవర్గం నిర్లక్ష్యం చేయడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు వివరాల్లోకి వెళ్తే వేములవాడ రూరల్ మండలంలోని చెక్కపల్లి గ్రామంలో చేతికి వచ్చే వరి పొలాలు గత ఆరు నెలలుగా ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడం వల్ల కరెంటు సప్లై సరిగా లేక బావుల మోటర్లు కాలిపోయి రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. తమ పంట పొలాలు బతకాలంటే వెంటనే ట్రాన్స్ఫార్మర్ లను రిపేర్ చేసి. లేదా కొత్తవి అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు వీటి విషయం పై సెస్ అధికారులతో పాటు పాలకవర్గాన్ని పలుమార్లు విన్నవించినప్పటికీ పెడచెవిన పెడుతున్నారని పలువురు రైతులు విమర్శలు చేస్తున్నారు. బావిలో నీళ్లు ఉన్నప్పటికీ వాటిని సకాలంలో పంటలు అందించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించకుంటే రోడ్డుపైకి వచ్చి నిరసన వ్యక్తం చేయాల్సి ఉంటుందని రైతులు హెచ్చరిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *