
Ravana Dahan Donated by Sammi Goud Foundation
రావణాసుర బొమ్మ దాత….సమ్మిగౌడ్ చిలువేరు
కేసముద్రం/ నేటి దాత్రి
కేసముద్రం మండలంలోని ఉప్పరపల్లి గ్రామంలో యువత యూత్ క్లబ్ అనుబంధంగా గత 20 సంవత్సరాల నుండి గ్రామ ప్రజల ఆధ్వర్యంలో దసరా ఉత్సవాలలో భాగంగా రావణాసుర వధ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.ఈ కార్యక్రమానికి కేసముద్రం మున్సిపాలిటీలోని సమ్మి గౌడ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు చిలువేరు సమ్మయ్య గౌడ్ తన వంతుగా రావణాసుర బొమ్మకు దాతగా నిలిచారు..ఈ సందర్భంగా సమ్మి గౌడ్ ఫౌండేషన్ అధినేత సమ్మయ్య గౌడ్ మాట్లాడుతూ… గ్రామ ప్రజలంతా కలిసి దసరా ఉత్సవాలను పురస్కరించుకొని చేస్తున్నటువంటి రావణాసుర వద కార్యక్రమంలో నన్ను మీ కుటుంబ సభ్యునిగా భావించి మీతోపాటు భాగస్వామిని చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉందని ఆనందాన్ని వ్యక్తపరిచారు. అదేవిధంగా గ్రామ యువత యూత్ మాట్లాడుతూ… అన్నా మా గ్రామం నుండి మా యువత యూత్ అడిగిన వెంటనే స్పందించి దసరా ఉత్సవాలలో భాగంగా రావణ సుర వద కార్యక్రమానికే కాదు మీరు మా గ్రామంలో పేదింటికి ఒక బిడ్డగా ఆడబిడ్డలకు అన్నగా యువతకు సోదరునిగా గ్రామ ప్రజలకు ఒక బిడ్డగా మీరు చేస్తున్నటువంటి సేవలు మరువలేనివని సమ్మి గౌడ్ ఫౌండేషన్ పట్ల వర్షం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో యువత యూత్ క్లబ్ అధ్యక్షులు తండా సంపత్, ఉపాధ్యక్షులు పలస రాకేష్,రావణాసుర ఉత్సవ కమిటీ అధ్యక్షులు ఎటురోజు పరిపూర్ణ చారి, ఉపాధ్యక్షులు తండా శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు కోమాకుల రమేష్, పబ్బతి సారంగం, శాగంటి రాములు, ముదురుకోళ్ల రమేష్, అడప రమేష్, ఎండి షబ్బీర్, ప్రవీణ్, శ్రీకాంత్, గంట రవి, సతీష్ తదితరులు పాల్గొన్నారు.