ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర కార్యదర్శి వై గీత.
హైదరాబాద్ /వికారాబాద్,నేటిధాత్రి:
వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో
పసికందు మృతికి కారణమైన డాక్టర్ ను సస్పెండ్ చేయాలని ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర కార్యదర్శి వై గీత డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో రాత్రి ఒంటిగంట సమయంలో ఒక పసి బాబుకు ఎక్కిళ్లు వచ్చాయని డాక్టర్ కు తెలియజేశారు. డాక్టర్ అప్పుడే స్పందిస్తే బాబు బతుకుతుండేది.కాలయాపన చేసి ఎంత సేపటికి రాకపోవడంతో పసికందు వైద్యుడి నిర్లక్ష్యంతో మృతి చెందడాని గీత అవేదన వ్యక్తం చేశారు. మాదిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన స్వప్న బిక్షపతి దంపతుల రోదనకు కారణమైన డాక్టర్ సస్పెండ్ చేయాలన్నారు.ఆసుపత్రికి రాత్రిపూట పోతే అటెండర్ తప్ప డాక్టర్లు ఎప్పుడు అందుబాటులో ఉండరు.ఒకవేళ సిస్టర్ ల తోనే ట్రీట్ మెంట్ చేపిస్తారు. ఏదైనా అత్యవసరమైతే హైదరాబాద్ పొండి అని చేతులు దులుపుకోవడం జరుగుతున్నదని ఇలాంటి సందర్భాలు అనేకం ఉన్నాయని ఆమె ఆరోపించారు. ప్రభుత్వ ఆసుపత్రి అంటేనే నరకయాతన తలపిస్తున్న వికారాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్ పరిస్థితులు ఎన్ని సంఘటనలు జరిగినా మారడం లేదని వాపోయారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న డాక్టర్ల పైన చర్యలు తీసుకోవాలని ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర కార్యదర్శి వై గీత డిమాండ్ చేశారు.