
# నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి
# రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, జిల్లా ఇన్చార్జ్ మంత్రి రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాక
# జిల్లా కలెక్టర్ సత్య శారదతో కలిసి పరిశీలన.
నర్సంపేట,నేటిధాత్రి :
*నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందెందుకు గాను నర్సంపేట పట్టణంలో 350 పడకల జిల్లా ఆసుపత్రికి గత కేసీఆర్ ప్రభుత్వం హయాంలో నిర్మాణ పనులు మొదలు కాగా ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో పనులు పూర్తి అయ్యాయి.అలాగే గత ప్రభుత్వం హయాంలో నర్సంపేటకు జిల్లా స్థాయిలో ప్రభుత్వ మెడికల్ కళాశాల మంజూరు అయ్యింది. ఈ నేపథ్యంలో వైద్య కళాశాలలో 2024-2025 సంవత్సరానికి గాను తరగతుల ప్రారంభం కానున్నాయి.ఐతే గత కొన్ని ఏండ్ల నుండి జిల్లా ఆసుపత్రి,మెడికల్ కళాశాల ఎదురుచూస్తున్న నియోజకవర్గ ప్రజలకు ఆశలు నెరవేర్చనున్నారు స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి.అందుకు జిల్లా ఆసుపత్రి,మెడికల్ కళాశాలలను ఈ నెల 17 న ప్రారంభం కానున్నట్లు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తెలిపారు. ఈ కళాశాల,జిల్లా ఆసుపత్రిలను
వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ,ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు ప్రారంభించనున్నారు.*
నర్సంపేట పట్టణంలో నూతనంగా నిర్మించిన జిల్లా ఆస్పత్రి, వైద్య కళాశాలలను ఈనెల 17న ప్రారంభినచనున్నట్లు ఈ కార్యక్రమానికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ,వరంగల్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రానున్నారని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తెలియజేశారు. నిర్మాణ పనులు పూర్తయిన ఆసుపత్రి, కళాశాల భవనాలను జిల్లా కలెక్టర్ సత్య శారదాతో కలిసి నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పరిశీలించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరెడ్డి మాట్లాడుతూ 50 మంది వైద్య విద్యార్థులకు సరిపడే విధంగా ప్రొఫెసర్లను ఇతర సిబ్బంది నియమించడం జరిగిందని, జిల్లా ఆసుపత్రికి అనుగుణంగా పరికరాలు వైద్యులను నియమించడం దాదాపు పూర్తయిందని భవన నిర్మాణాల్లో పూర్తిస్థాయిలో అభివృద్ధి కొనసాగుతుందని తెలంగాణ అన్నారు. రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నటువంటి ఎనిమిది నూతన కళాశాలలు వైద్యశాలలో నర్సంపేట ఆసుపత్రికి కళాశాలకు మాత్రమే అవకాశం వచ్చిందని అన్నారు.ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మోహన్ దాస్,
ఆర్డీవో కృష్ణవేణి,డీసీపీ రవీందర్, డిఎమ్అండ్ హెచ్ఓ వెంకటరమణ,డాక్టర్లు,ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పోలీసు అధికారులు ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.