విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని జిల్లా కలెక్టర్ రాహూల్ శర్మ
భూపాలపల్లి నేటిధాత్రి
శనివారం భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ వంటగదిలో మధ్యాహ్న భోజనం కోసం వండిన వంటకాలను పరిశీలించారు.
స్టోర్ రూమ్, డార్మెటరీ హాల్ లను తనిఖీ చేసి
అనంతరం విద్యార్థులతో మాట్లాడి పాఠశాలలో అందిస్తున్న ఆహార పదార్థాలు గురించి అడిగి తెలుసుకున్నారు.
ప్రస్తుతం అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాల అద్దె భవనంలో కొనసాగుతున్నదని భవనం అసంపూర్తి నిర్మాణంలో ఉన్నదని సిబ్బంది జిల్లా కలెక్టర్ దృష్టికి స తీసుకు రాగా జిల్లా విద్యాశాఖ అధికారి తో ఫోన్లో మాట్లాడి అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలను మరొక భవనంలోకి తరలించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన పోషకాహారం అందించాలని, శీతాకాలం దృష్యా స్నానాలకు వేడి నీటిని అందించేందుకు వాటర్ హీటర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. విద్యార్థులకు ఒక జత యూనిఫామ్ మాత్రమే అందించారని మరొక జత యూనిఫామ్ అందించాలని డిఈఓను ఆదేశించారు. సిబ్బంది సమయపాలన పాటిస్తూ విధులకు సకాలంలో హాజరు కావాలని స్పష్టం చేశారు. పాఠశాలలలో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. విద్యార్థులకు ఏదేని ఆరోగ్య సమస్య వస్తే వెంటనే వైద్య సేవలు అందించాలని, విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం అందించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాల స్పెషల్ ఆఫీసర్ వేణు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.