భద్రాచలం నేటి ధాత్రి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ని మర్యాదపూర్వకంగా కలిసిన కాంగ్రెస్ పార్టీ జిల్లా మైనార్టీ అధ్యక్షులు మహమూద్ ఖాన్ ఈ సందర్భంగా కలెక్టర్ తో మాట్లాడుతూ గతంలో కేటాయించిన కుట్టు మిషన్లను అర్హులైన పేదలకు వెంటనే పంపిణీ చేయాలని కోరడం జరిగింది రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలో ఇప్పటికే పంపిణీ చేయడం జరిగిందని మన జిల్లాలో ఆలస్యం అయిందని తెలియజేశారు నిజమైన అర్హులకి గుర్తించి వారికి పంపిణీ చేయాలని కలెక్టర్ ని కోరడం జరిగింది కలెక్టర్ స్పందిస్తూ వెంటనే కుట్టుమిషన్లను త్వరలోనే నిజమైన అర్హులకు గుర్తించి అందిస్తామని హామీ ఇవ్వడం జరిగింది.. ఈ కార్యక్రమంలో జిల్లా మైనార్టీ ఉపాధ్యక్షులు కరీం పాషా,జిల్లా మైనార్టీ సెక్రటరీ గౌస్ పాషా, కొత్తగూడెం టౌన్ మైనార్టీ వైస్ ప్రెసిడెంట్ ఎండి .అక్బర్, చుంచుపల్లి మండల మైనార్టీ అధ్యక్షులు గోరే బాబు, భద్రాచలం పట్టణ మైనార్టీ అధ్యక్షులు షేక్ అలీమ్,బూ ర్గంపహాడ్ మండలం యూత్ నాయకులు అన్వర్, తదితరులు పాల్గొన్నారు.