Collector Helps Ailing Student
అస్వస్థతకు గురైన విద్యార్థినినీ ఆసుపత్రికి తరలించిన జిల్లా కలెక్టర్
భూపాలపల్లి నేటిధాత్రి
జయ శంకర్ భూపాలపల్లి జిల్లా ఘనపురం మండలం చెల్పూర్ జడ్పీ.ఎస్.ఎస్ ప్రభుత్వ పాఠశాలలో జరుగుతున్న పదవతరగతి పరీక్షల కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పరిశీలించడానికి వెళ్లగా ఘనపురం మండలం గాంధీ నగర్ లోని మహాత్మా జ్యోతి భా పులే గురుకుల పాఠశాలలో చదువుతూ పదవతరగతి పరీక్షలు రాస్తున్న” కీర్తన” అనే విద్యార్థిని ఉదయం పరీక్షా కేంద్రానికి వచ్చినప్పటి నుండి అలసటగా ఉందని శ్వాస ఆడడం లేదని ఇబ్బందులు పడుతుండగా పరీక్ష కేంద్రం పరిశీలనకు వెళ్లిన జిల్లా కలెక్టర్ విషయం తెలుసుకొని వెంటనే ప్రభుత్వ వాహనంలో తన వ్యక్తిగత సిబ్బందిని వెంట పంపి స్థానిక ఆసుపత్రికి తరలించారు.

అనంతరం పరీక్ష కేంద్రాన్ని పరిశీలించి తిరిగి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి అస్వస్థతకు గురైన విద్యార్థిని తో మాట్లాడి ధైర్యం చెప్పి తిరిగి పరీక్షా కేంద్రానికి ప్రభుత్వ వాహనంలోనే తరలించారు.
జిల్లా కలెక్టర్ స్పందించిన విధానం పట్ల పలువురు జిల్లా కలెక్టర్ ను అభిందిస్తున్నారు.
