మతిస్థిమితం లేని మహిళ అదృశ్యం
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్: బుచినెల్లి గ్రామానికి
చెందిన 18 యేళ్ల సత్వార్ నస్రీన్ గత కొన్ని సంవత్స రాలుగా మానసీక స్థితి సరిగా లేక అసాదారణంగా ప్రవర్తిస్తుంది. ఆమె 6 జూన్ 2025 ఉదయం 10 గంటల సమయంలో ఇంట్లో ఎవరు లేని వేళ ఎక్కడికో వెళ్లి తిరిగి రాలేదని ఆమె తల్లి సత్వార్ షబానా తెలి పారు. ఈ సంఘటనపై చిరాగ్పల్లి పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదైంది. నస్రీన్అండి సత్వార్ ఖదీర్ కుటుంబం పేర్కొన్న వివరాల ప్రకారం గత మూడు నెలల క్రితం కూడా ఆమె ఇలాగే ఇంటినుంచి వెళ్లిపోయినప్పుడు చిరాగ్పల్లి పోలీసులు మి స్సింగ్ కేసు నమోదు చేసి ఆమెను క్షేమంగా తిరిగి తీసుకొచ్చారు. ఈసారి కూడా నస్రీన్ తల్లి షబానా ఫిర్యాదు మేరకు చిరాగ్పల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చే యబడింది. సబ్ ఇన్స్పెక్టర్ చిరాగ్పల్లి పోలీస్ స్టేషన్ తెలిపిన వివరాల ప్రకారం న స్రీన్ కోసం దర్యాప్తు . మేము అన్ని వైపుల నుంచి ఆమె అచూకీ కోసం విచారణ చేస్తున్నామని, గతంలో ఆమెను కనుగొన్న అనుభవం ఆధారంగా ఈసారి కూడా త్వరలోనే ఆమెను కొనుగొనేందుకు ప్రయత్నిస్తున్నామని ఎస్సై తెలిపారు.