
బాదేపల్లి వీరభద్ర సంఘం.
మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
జడ్చర్ల అభివృద్ధి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి తోనే సాధ్యమని బాదేపల్లి వీరభద్ర సంఘం వారు పేర్కొన్నారు, జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని కల్వకుర్తి రోడ్డు లో ఎమ్మెల్యే నివాసంలో ఎమ్మెల్యే డాక్టర్ సి లక్ష్మారెడ్డి ని కలిసి వీరభద్ర సంఘం ఆధ్వర్యంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏకగ్రీవంగా సంపూర్ణ మద్దతు లక్ష్మారెడ్డి కి ఇస్తామని ప్రకటించారు, జడ్చర్లలో వీరభద్ర సంఘం వారిని ఎవరు గతంలో గుర్తించలేదని కానీ లక్ష్మారెడ్డి మా కుల సంఘానికి భవనం నిర్మాణం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు, ఎల్లవేళలా అందుబాటులో ఉంటు పనిచేస్తున్న నాయకులు లక్ష్మారెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించేందుకు కృషి చేస్తామని చెప్పారు,