Month Cyclone Devastates Crops, MLA Demands Relief
మొంత తుఫాన్ బీభత్సం… నేలకొరిగిన పంట పొలాలు
నష్టపోయిన రైతులను తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలి
మానుకోట మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్.
కేసముద్రం/ నేటి ధాత్రి
తుఫాను ప్రభావంతో చేతికి అందిన పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణమే అంచనా వేసి పరిహారం చెల్లించి ఆదుకోవాలి మానుకోట మాజీ శాసనసభ్యులు బానోత్ శంకర్ నాయక్ డిమాండ్ చేశారు. విత్తనాల దగ్గర నుంచి ఎరువుల వరకు అనేక విధాలుగా రైతులు ఈ ప్రభుత్వంలో కష్టాలు ఎదుర్కొని ఆరుగాలం కష్టపడి పండించిన పంట మరికొద్ది రోజుల్లో కోత దశకు వస్తున్న నేపథ్యంలో ఈ తుపాను కారణంగా నియోజకవర్గంలో అనేకచోట్ల వరిచేను నీలమట్టం కావడం రైతులు పార్టీ నాయకుల ద్వారా తన దృష్టికి వచ్చిందన్నారు. ఈ మేరకు గురువారం స్థానిక మండల నాయకులతో కలిసి కేసముద్రం మండలం ధనసరి గ్రామంలో నీలమట్టమైన వరి పంటను ఆయన పరిశీలించారు తక్షణమే సంబంధిత అధికారులు నష్టపరిహారాన్ని అంచనా వేసి బాధిత రైతులకు చెల్లించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి రావుల శ్రీనాథ్ రెడ్డి, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు నజీర్ అహ్మద్, పట్టణ అధ్యక్షులు గుగులోత్ వీరు నాయక్, ప్రధాన కార్యదర్శి కమటం శ్రీనివాస్, మాజీ సర్పంచ్ కొండ్రెడ్డి రవీందర్ రెడ్డి, బానోతు వెంకన్న నాయక్, బిర్రు వెంకన్న, బానోత్ శ్రీను నాయక్, బండారు గోపి, వంగల అశోక్, భానోత్ భీమన్న, గణేష్,బాధవత్ గణేష్ తదితరులు పాల్గొన్నారు.
