స్కూలు గ్రాండ్ కు వినియోగించిన వివరాలు క్యాష్ బుక్ నందు వెంటనే నమోదు చేయాలి

గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి :
గురువారం అమ్మ ఆదర్శ పాఠశాల పనుల యొక్క పర్యవేక్షణలో భాగంగా జిల్లా విద్యాధికారి ఏం వెంకటేశ్వర చారి, జిల్లా ప్లానింగ్ కోఆర్డినేటర్ నగిన సతీష్ కుమార్ తో కలిసి గుండాల మండలంలోని పాఠశాలలను సందర్శించారు.
ఈ తనిఖీలో భాగంగా ఎంపీపి ఎస్ మోదుగుల గూడెం పాఠశాల సందర్శించినప్పుడు ఆ పాఠశాలలో డ్రింకింగ్ వాటర్ కొరకు ఏర్పాటుచేసిన ట్యాంక్ సరిగా లేదని దానికి వెంటనే సరి చేయాలని సూచించారు.
ఎంపీపీ ఎస్ , ముక్తి గుంపు పాఠశాలలో రిపేర్లు అవసరం ఉన్నప్పటికీ ఎస్టిమేషన్ పెట్టకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు.
ఎంపీపీ ఎస్ , పడుగొనిగూడెం పాఠశాలలో స్కూల్ గ్రాండ్ వినియోగంపై రికార్డులు చూపకపోవడం పై షోకాజు నోటీస్ జారీ చేశారు.
జడ్పీ హెచ్ఎస్ , గుండాల పాఠశాల కాంప్లెక్స్ కు సంబంధించి అన్ని రికార్డులు పరిశీలించి, ఖర్చు వివరాలు సరిగా నమోదు చేయాలని, నిధులు దుర్వినియోగం జరిగినచో శాఖ పరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
తర్వాత మండలంలో అన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులతో సమావేశం నిర్వహించి అమ్మ ఆదర్శ పాఠశాలల పనులలో ప్రధానోపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించి సకాలంలో పనులన్నీ పూర్తయ్యే విధంగా చూడాలని, ప్రతి పాఠశాలకు ట్యాబు ను ఇవ్వడం జరిగిందని, ఫ్రీ గా డేటా కూడా అందిస్తున్నామని వాటిని ఉపయోగించి రిపోర్టింగ్ వెంటనే చేయాలని చెప్పడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సత్యనారాయణ, ఏంఈఓ కృష్ణయ్య, ఏంఎన్ ఓ పార్వతమ్మ ,ఏం ఐఎస్ ,సీసీఓ లు, సిఆర్ పి లు మరియు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గోన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!