మృతి చెందిన తాపీ మేస్త్రి కార్మికునికి కుటుంబానికి ఆర్థిక చేయూత…
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
క్యాతనపల్లి మున్సిపాలిటీ పరదిలోని రామకృష్ణాపూర్ పట్టణంలో గల14వ వార్డ్ పోచమ్మ బస్తీ ఏరియాకు చెందిన భవన నిర్మాణ కార్మికుడు పానుగంటి వెంకటేష్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. అయన కుటుంబం నిరుపేద కావడంతో పట్టణ భవన నిర్మాణ కార్మిక సంఘం సభ్యులందరూ కలిసి 17 వేల 7 వందల రూపాయలను మృతి చెందిన కుటుంబ సభ్యులకు ఆ సంఘం గౌరవ అధ్యక్షుడు గాండ్ల సమ్మయ్య, అధ్యక్షుడు జీలకర్ర రాయమల్లు చేతుల చేతుల మీదుగా అందజేసి మానవత్వం చాటుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆ కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటామని హామీ ఇచ్చి మనోధైర్యం కల్పించారు. ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఎర్రబెల్లి రాజేష్, సంగ రవికుమార్, భవన నిర్మాణ కార్మిక సంఘం జనరల్ సెక్రెటరీ గొప్ప శంకర్, ట్రెజరరీ కత్తెర సతీష్, సభ్యులు బాదావత్ రాజు, ముంత శ్రీనివాస్, కల్లేపల్లి ప్రసాద్, బొబ్బిలి వీరస్వామి, చొప్పరి నరేష్ తదితరులు పాల్గొన్నారు.