ధర్మపురి శ్రీనివాస్ మరణం తీరనిలోటు

– కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి
సిరిసిల్ల(నేటి ధాత్రి):

తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీ రాజకీయ ప్రస్థానంలో మాజీ మంత్రి, పిసిసి మాజీ అధ్యక్షులు, ధర్మపురి శ్రీనివాస్ మరణం తీరని లోటని సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి అన్నారు. సిరిసిల్లలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సంతాప సభలో ఆయన మాట్లాడుతూ డిఎస్ శ్రీనివాస్ తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ప్రజాసేవకు అంకితమయ్యారని పేర్కొన్నారు. ఆయన మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *