
గొల్లపల్లి నేటి ధాత్రి:
జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలోని మోడల్ స్కూల్స్ లో 2024 -25 విద్యా సంవత్సరానికి గాను ఆన్లైన్లో దరఖాస్తు గడువు నేటితో ముగియనుంది. ఈనెల 10 నుంచి 25 వరకు ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణకు నోటిఫికేషన్ వెలువడింది. పదో తరగతిలో సాధించిన జి పి ఏ ఆధారంగా మండల కేంద్రంలోని మోడల్ స్కూల్, కాలేజీలో ఎంపీసీ, బైపిసి, సీఈసీ, ఎం ఈ సి గ్రూపులలో 40 చొప్పున సీట్లు ఉన్నాయని, ఆసక్తిగల విద్యార్థినీ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని, అమ్మాయిలకు హాస్టల్ వసతి సౌకర్యం కలదు. ఎంపీసీ, బైపిసి విద్యార్థులకు ఎంసెట్, నీట్, ఐఐటి, జేఈఈ కోచింగ్ సి ఈ సి, ఎం ఇ సి విద్యార్థులకు సి ఎ, సి పి టి, టాలీ , అకౌంటింగ్ పైన కోచింగ్ ఇవ్వబడును. ఉచిత టెస్ట్ బుక్స్, నోట్ బుక్స్, యూనిఫామ్, స్కాలర్షిప్ సౌకర్యం కలదు. ఈ సదవకాశాన్ని గ్రామీణ ప్రాంత విద్యార్థినీ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపల్ ఈరవేణి రాజ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.