సొంతిల్లు లేక స్మశాన వాటిక దగ్గరనే మృతదేహం..అంత్యక్రియలు పూర్తి

అంత్యక్రియలు పూర్తి…
పద్మశాలి కుల సంఘం ఆర్థిక సహాయం అందజేత…..

నేటిధాత్రి కమలాపూర్ (హన్మకొండ)కమలాపూర్ మండల కేంద్రము నకు చెందిన గాజుల రాజేందర్ (50) శుక్రవారం రాత్రి అనారోగ్యం తో మృతి చెందాడు. నిరుపేద కుటుంబానికి చెందిన రాజేందర్ గత 30 ఏళ్లుగా అద్దె ఇంట్లో ఉంటూ స్థానిక మార్కెట్ వద్ద టీ కొట్టు పెట్టుకుని జీవనం కొనసాగిస్తున్నారు. స్వంత ఇల్లు లేక పోవటం తో అతని మృత దేహాన్ని స్థానిక స్మశాన వాటిక ఎదురుగా ఉన్న ఖాళీ స్థలము లో ఉంచి కుటుంబ సభ్యులు,బంధువులు చందాలు వేసుకుని అంత్య క్రియలు నిర్వహించారు. కుటుంబం పెద్దదిక్కు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుగా విలపించగా, పద్మశాలి కుల సంఘం సభ్యులు పరామర్శించి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం కులస్తులు 11 వేల ఆర్థిక సాయం చేశారు. సంఘం నాయకులు బోప్ప శివశంకర్ మాట్లాడుతూ నిరుపేద కుటుంబానికి చెందిన రాజేందర్ కుటుంబాన్ని ప్రభుత్వము అన్ని విధాల ఆదుకోవాలని, నిలువ నీడ లేక అంతక్రియలకు కూడా ఇబ్బందులు కలుగుతున్నాయని, ప్రభుత్వం ఇలాంటి నిరుపేదలకు ముందుగా ఇల్లు నిర్మించి ఇవ్వాలని కోరారు. అలాగే పద్మశాలి కులస్తులు రాజేందర్ కుటుంబానికి తోచిన సాయంతో ఆదుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కమలాపూర్ మండల పద్మశాలి సంఘం అధ్యక్షులు బోప్ప శివశంకర్, పట్టణ శాఖ అధ్యక్షులు బైరి దశరథం, ప్రధాన కార్యదర్శి పులికంటి రాజేందర్, బైరి సహదేవ్,తుమ్మ రాజు, రాజేశం,తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!