Smoke Pollution Threatens Students
పొగ కాలుష్యంతో విద్యార్థులకు పొంచి ఉన్న ప్రమాదం
బ్లూ బర్డ్స్ పాఠశాల యజమాన్యం నిర్లక్ష్యం
నస్పూర్,నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలం విద్యానగర్ లోని బ్లూ బర్డ్స్ పాఠశాలలోని సిబ్బంది పాఠశాలలో ఉన్న చెత్తా,చెదారం చెత్తకుండీలో వేయకుండా నిప్పంటించి నిర్లక్ష్యంగా వదిలేస్తున్నారు.పాఠశాల సమీపంలో చెత్తను కాల్చడం వల్ల పొగ కాలుష్యం తరగతి గదిలోకి వ్యాపించి విద్యార్థులకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కలుగుతున్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు పేర్కొన్నారు.అలాగే పక్కనే ఉన్న రెండు పాఠశాల గదుల్లోకి పొగ వ్యాపించడంతో చలికాలం దగ్గు,జలుబుతో బాధపడే విద్యార్థులకు కళ్ళ మంటలతో,శ్వాస ఇబ్బందులు కలుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.పాఠశాల యజమాన్యం నిర్లక్ష్యం వల్ల చాలా సమస్యలు ఎదురవుతున్నాయని అన్నారు.ఇప్పటికైనా పాఠశాలలోని చెత్త,చెదారం కాల్చి వేయకుండా చెత్తను సేకరించి చెత్త కుండీలో వేయాలని కోరారు.
