Good Friday Cross Procession Held in Parakala
ఘనంగా (గుడ్ ఫ్రైడే)యేసు సిలువ యాత్ర
పరకాల,నేటిధాత్రి
పట్టణంలో శుక్రవారం ఉదయం గుడ్ ఫ్రైడే సందర్భంగా కారుణ్య యేసు కథోలిక ప్రార్థన మందిరం ఆధ్వర్యంలో యేసు సిలువ యాత్ర కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఫాదర్ రెవరెండ్ బాలరాజు నాయకత్వం వహించారు.ఈ సందర్భంగా యేసు క్రీస్తు అనుభవించిన శ్రమలు, త్యాగాన్ని స్మరించుకుంటూ భక్తులు సిలువను మోస్తూ పట్టణంలోని ప్రధాన రహదారుల గుండా ప్రదర్శనగా నడిచారు.ప్రార్థనలు,భజనలు, బైబిల్ పఠనాలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.పట్టణంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో క్రైస్తవ భక్తులు పాల్గొని యాత్రను విజయవంతం చేశారు.యేసు క్రీస్తు మానవాళి కోసం చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ శాంతి,ప్రేమ,సేవ భావాలను అనుసరించాలని ఫాదర్ బాలరాజు తన సందేశంలో పేర్కొన్నారు.ఈ కార్యక్రమం పట్టణంలో భక్తి పరవశాన్ని నింపుతూ గుడ్ ఫ్రైడే సందేశాన్ని ప్రజల్లో విస్తరించింది.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు టీపీసీసీ రాష్ట్ర ఎస్సీ విభాగం వైస్ చైర్మన్ డాక్టర్ మడికొండ శ్రీను,మాజీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, మాజీ కౌన్సిలర్ మడికొండ. సంపత్ కుమార్,సిస్టర్ మెరీన్, బొచ్చు.జాన్సన్,చంద్రశేఖర్, కిషన్,అరికెళ్ల దశరథం, నాగేల్లి సుగుణ,యువతి, యువకులు,సంఘస్తులు, పట్టణ ప్రజలు,అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు.
