జైపూర్,నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ముదిగుంట గ్రామ పంచాయితీ లో పారిశుద్ధ్య వ్యవస్థ నిర్వహణలో నిర్లక్ష్యం తాండవిస్తోంది.డంపింగ్ యార్డ్ ని నిరుపయోగంగా మార్చి చెత్తను తీసుకువెళ్లి వాగులో చెరువులో పార వేయడం జరుగుతుంది.ప్రతిరోజు ఇంటింటికి తిరిగి చెత్త సేకరించి ఆ చెత్తను వర్గీకరించి తడి చెత్త,పొడి చెత్త వేరువేరుగా డంపింగ్ యార్డ్ లో నిల్వచేసి సేంద్రియ ఎరువుగా మార్చి పల్లె ప్రగతి ఉద్యానవనానికి ఉపయోగించాల్సిందిపోయి వారంలో నచ్చిన రోజున చెత్తను సేకరిస్తూ తీసుకువెళ్లి నచ్చిన చోట పారవేస్తున్న వ్యవస్థ ముదిగుంట గ్రామపంచాయతీలో చోటు చేసుకుంది.గ్రామంలోని ప్రజలు మాట్లాడుతూ చెత్త సేకరణలో నిర్లక్ష్యం వల్ల వ్యాధులు వ్యాపిస్తున్నాయని,మంచినీటి వనరులు కలుషితం అవుతున్నాయని,గ్రామ ప్రజల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుందని,చెత్త సేకరణలో నిర్లక్ష్యానికి నివారించడానికి గ్రామపంచాయతీ వ్యవస్థ నిర్దిష్ట సమయంలో చెత్త సేకరణ నిర్వహించాలనీ,గ్రామ పర్యావరణం పై ప్రతికూల ప్రభావం చూపకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని,వృద్ధుల,పిల్లల ఆరోగ్యం పై అనేక రకాల వ్యాధుల ప్రభావం పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని,లక్షల రూపాయలు ప్రజాధనాన్ని వెచ్చించి నిరుపయోగంగా వదిలేయడానికి డంపింగ్ యార్డ్ ను కట్టించారా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.ప్రతిరోజు చెత్త సేకరణ చేసి డంపింగ్ యార్డు లో ప్రణాళిక బద్ధంగా ప్రోసెసింగ్ చేయాలని,అధికారులు నిర్లక్ష్య ధోరణినీ వదిలేసి గ్రామాలను కాపాడాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు.