
CPI Supports BC Reservation Bandh
బీసీ రిజర్వేషన్ లపై బంద్ కు సిపిఐ పార్టీ సంపూర్ణ మద్దత్తు.
◆:- జిల్లా కార్యదర్శి సయ్యద్ జలాలుద్దీన్
జహీరాబాద్ నేటి ధాత్రి:
బీసీ రిజర్వేషన్ లను అమలు చెయ్యాలని ప్రజలంతా కోరుతున్న సందర్భంలో బీసీ రిజర్వేషన్ లపై హైకోర్టు స్టే ఇవ్వడం తగదని వెంటనే రిజర్వేషన్ లను కల్పించాలని కోరుతూ ఈ నెల 18 నాడు బీసీ సంఘాల జేఏసీ ఇచ్చిన బంద్ లో సిపిఐ జిల్లా శ్రేణులన్నీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చెయ్యాలని సిపిఐ పార్టీ సంగారెడ్డి జిల్లా కార్యదర్శి సయ్యద్ జలాలుద్దీన్ పిలుపునిచ్చారు ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ లు అమలు చెయ్యాలని ప్రజలు రాష్ట్రాలు కోరుతుంటే బీజేపీ ప్రభుత్వం నిమ్మకనిరేతినట్లు వ్యవహారిస్తుందని అన్నారు,ఇప్పుడు బీజేపీ అసలు స్వరూపం బయటపడుతుందని అన్నారు. అగ్రవర్ణ కులాల వెనుకబడిన వారికీ ఏ రాష్ట్రం కానీ,ప్రజలు కానీ అడగలేదని,ఎక్కడా ధర్నాలు కానీ నిరసనలు జరగలేదని కానీ బీజేపీ ప్రభుత్వం 10 శాతం కూడా లేనివారికీ 10 శాతం రిజర్వేషన్ లు ఇచ్చి పార్లమెంట్ లో అమోదింప చేసుకొని సుప్రీమ్ కోర్టు విధించిన 50 శాతం పరిమితి కూడా మించిపోయిందని,ఇది బీజేపీ కి అగ్రవర్ణాలకు ఇచ్చే సహకారమని అగ్రవర్ణాల పై చూపుతున్న ప్రేమ బీసీలపై చూపుతున్న వివక్షత కనబడుతుంది అన్నారు కానీ బీసీ లు అడిగితే మాత్రం చెయ్యట్లేదని ఇప్పటికైనా బీజేపీ నాటకాలు మానేసి బీసీ బిల్లును పార్లమెంట్ లో అమోదించాలని లేకపోతే ఒక విషయం మాత్రం బిజెపి గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ ఉద్యమానికి పురిటి గడ్డ దేశంలోనే తెలంగాణకు ఉద్యమాలు నిర్మించిన చరిత్ర కలదు నిజాం నుంచి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నుంచి ప్రత్యేక తెలంగాణ ఇలాంటి పోరాటాలు నిర్వహించిన చరిత్ర తెలంగాణకు కలదు. ఇలాంటి పోరాటాలు బీసీ ఇల్లు కోసం ఉధృతం కాకముందే కేంద్ర ప్రభుత్వం బిసి బిల్లు ఆమోదించాలని లేనిపక్షంలో బీజేపీ ని రానున్న ఎన్నికల్లో తిరస్కరిస్తారని అన్నారు.బీసీ రిజర్వేషన్ లు అమలు అయ్యేంత వరకు సిపిఐ పార్టీ కార్యకర్తలు పోరాటాలకు నాయకత్వం వహించాలని కోరారు.